
రక్తదానం చేసిన మంత్రి
గజపతినగరం రూరల్: ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. అనంతరం స్థానిక యువత నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన కూడా రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మక్కువ శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
జనసేన నాయకుడిపై
అట్రాసిటీ కేసు నమోదు
రాజాం సిటీ: జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి పొగిరి సురేష్‌బాబుపై రాజాం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందని ఎస్సై వై.రవికిరణ్ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. జనసేన సభ్యత్వ నమోదు కార్డులు స్థానిక బొబ్బిలి రోడ్డులోని ఆర్‌కే కాంప్లెక్స్‌లో ఇస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తెలియజేయడంతో ఒమ్మి గ్రామానికి చెందిన చిత్తిరి నాగరాజు శనివారం ఉదయం అక్కడకు చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జనసేన నాయకుడు పొగిరి సురేష్‌బాబు నువ్వెందుకు ఇక్కడకు వచ్చావని నాగరాజును దుర్భాషలాడాడు. కులం పేరుతో దూషించడంతో పాటు కాలితో తన్నాడు. పైగా తన అనుచరులతో దాడి చేసేందుకు ప్రయత్నించగా.. బాధితుడు తప్పించుకుని బయటకు వచ్చి జనసేన నాయకులకు విషయం తెలియజేశాడు. అనంతరం పొగిరి సురేష్‌బాబుపై శనివారం సాయంత్రం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ..ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
చంద్రబాబు పుట్టిన రోజు..
మనకు వంచన దినం
● అంబేడ్కర్ రైట్స్ ఫోరమ్ రాష్ట్ర
అధ్యక్షుడు భానుమూర్తి
విజయనగరం టౌన్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినాన్ని ఎస్సీ రిజర్వేషన్‌ల వంచన దినంగా పాటిద్దామని ఆంధ్రప్రదేశ్ అంబేడ్కర్ రైట్స్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు భానుమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానిక అంబేడ్కర్ భవన్‌లో కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన దుర్మార్గమన్నారు. గత వైఎస్సార్ ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల సర్వేను క్యాస్ట్ సర్వేగా పరిగణిస్తూ జీఓ 91 విడుదల చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టిన రోజును ఎస్సీ రిజర్వేషన్ల వంచనదినంగా నిర్వహిస్తామన్నారు. అనంతరం వంచనదినం కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో దారాన వెంకటేష్ , బుదరాయవలస మధుసూదనరావు, వేమల వంశీ, లోపింటి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: ఇంట్లో కరెంట్ లేదని, దాన్ని మరమ్మతు చేసే క్రమంలో ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు వదిలేశారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఆదిఆంధ్ర వీధికి చెందిన పినిమింటి నారాయణరావు(40) అనే వ్యక్తి ఆదివారం తన ఇంట్లో కరెంట్ వచ్చి పోతుండటంతో స్విచ్ బోర్డుకి వచ్చే వైర్లు ఊడిపోవడం గుర్తించి దాన్ని మరమ్మతు చేసేందుకు పూనుకున్నారు. అయితే మరమ్మతు చేసే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై కిందకు పడిపోయారు. దీంతో వెంటనే ఆయనను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి నారాయణరావు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకు న్న కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రో దించారు. మృతుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కీర్తన, మహేష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు.

రక్తదానం చేసిన మంత్రి

రక్తదానం చేసిన మంత్రి