
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సీతంపేట గిరిజన గ్రామం
● చంద్రబాబు కేబినెట్‌లో ప్రస్తావన
లేకపోవడం బాధాకరం
● హామీ ఇచ్చి మర్చిపోవడంపై ఆందోళన
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు మెల్లిక కురమయ్య. 2023లో ఆయన కుమార్తె చిన్నమ్మి జ్వరంతో మృత్యువాత పడింది. రెండు రోజులపాటు జ్వరం వచ్చిందని.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తే, పచ్చకామెర్లు సోకాయని వైద్యులు చెప్పారని, వెంటనే చనిపోయిందని ఆయన కన్నీటిపర్యంతమయ్యాడు. 20 ఏళ్ల వయస్సులోనే కుమార్తెను కోల్పోయానని వాపోయాడు. గ్రామంలో ఇటువంటి మరణఘోషలు ఎన్నో ఉన్నాయని.. కలుషిత నీరే ఇందుకు కారణమని ఆవేదన వ్యక్తం చేశాడు.
కొండకోనల్లో నాలుగు దశాబ్దాలుగా నివసిస్తున్న ఊరు వారిది కాదని, తక్షణమే ఖాళీచేయాలంటూ హుకుం జారీచేస్తున్నవారు కొందరు... ఏళ్ల తరబడి బురదనీరు తాగుతున్నామని, ఆరోగ్యం క్షీణించి గ్రామస్తులు మరణిస్తున్నారని, సమస్యకు శాశ్వత
పరిష్కారం చూపాలని వేడుకుంటే.. ‘కొబ్బరి నీళ్లు కావాలా’ అంటూ వెటకారం చేసేవారు మరికొందరు... సాగుభూమికి పట్టాలు ఇవ్వాలని ప్రాథేయపడినా కనికరించని అధికారులు... గ్రామం పక్కనే మైనింగ్ తవ్వకాలకు మాత్రం ఆగమేఘాలమీద అనుమతులు మంజూరు చేసిన పరిస్థితి మరోవైపు.. ఇలా.. ఆ గిరిజన గ్రామాలకు వెళ్తే కన్నీటి వ్యథలు, గిరిజనుల కష్టాల
జీవనం, సమస్యలే సాక్షాత్కరిస్తాయి. – సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్
● జిల్లా కేంద్రంలో ఉన్నా సరే..
విసిరేసినట్లు ఉండే గిరిజన గ్రామాలు
● కనీస సౌకర్యాలకు నోచుకోని
తాన్నవలస, తొక్కుడవలస, సీతంపేట గిరిజనులు
● రహదారికీ నోచుకోని అభాగ్యులు
న్యూస్‌రీల్

గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025