
సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
కొత్తవలస: విజయనగరాన్ని సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఎకై ్సజ్ శాఖ సహాయ కమిషనర్ పైడి రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు కొత్తవలస మండల కేంద్రంలో గల ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులను, నమోదవుతున్న కేసుల వివరాలను పరిశీలించి తగు సూచనలు సలహాలను అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవోదయం–2.0 కార్యక్రమాన్ని వచ్చేనెల 3వ వారంలోగా పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు.స్టేషన్ పరిధిలో గల వేపాడ, కొత్తవలస, లక్కవరపుకోట మండలా పరిధిలోని గ్రామాలను సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు.
గ్రామాల్లో బెల్లం అమ్మకాలు చేస్తున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. బెల్లం వ్యాపారస్తులు ప్రతి 15 రోజులకు ఒక పర్యాయం బెల్లం అమ్మకాలకు సంబంధించిన నివేదికలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమర్పించాలని స్పష్టం చేశారు. సిబ్బంది సారా తయారీ దారులతో కుమ్మకై నట్లు రుజువైతే వేటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ జీఎస్.రాజశేఖరనాయుడు, ఎస్సైలు వీఎన్.రాజు, ఎన్.రమశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్
పైడి రామచంద్రరావు