వర్మీ కంపోస్టుతయారీ జరగాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురంటౌన్: పంచాయతీల్లో ఉన్న చెత్త నుంచి సంపద కేంద్రాల్లో తడి, పొడి చెత్తగా వేరు చేసి వర్మీ కంపోస్టు తయారీ జరగాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డీఎస్ అధికారులతో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర డ్రైడే వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెస్స్ ద్వారా గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ సారి ఈవేస్ట్ సేకరణ థీమ్స్ నిర్వహిస్తున్నందున యాక్షన్ ప్లాన్‌ను నోడల్ అధికారులకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, డీఆర్‌ఓ హేమలత, కేఆర్‌సీ డివ్యూటీ కలెక్టర్ ధర్మాచంద్రారెడ్డి, డ్వామాపీడీ కె. రామచంద్రరావు, వివిథ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


