పార్వతీపురంటౌన్: పార్వతీపురం జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ శివనాగజ్యోతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించా రు. ఇప్పటి వరకు ఆమె పాలకొండ ఏరియా ఆస్పత్రి వైద్యురాలిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బి.వాగ్దేవి డీసీహెచ్‌ఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి, మెరుగైన వైద్యసేవలు అందించి రిఫర్ కేసుల సంఖ్య తగ్గించేందుకు చర్యలు చేపడతామని డాక్టర్ శివనాగజ్యోతి తెలిపారు.
ఏనుగుల విధ్వంసం
భామిని: మండలంలోని బిల్లుమడ గ్రామ సమీపంలో తిష్టవేసిన ఏనుగుల గుంపు వ్యవసాయ బోర్లను ధ్వంసం చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. నేరడి–బికి చెందిన సరిసాబ ద్ర మిన్నారావుకు చెందిన వ్యవసాయ బోరు ను, పైపులను ఏనుగుల గుంపు ధ్వంసం చేశా యి. రైతు సమాచారంతో అటవీశాఖ అధికారు లు వచ్చి బోరును పరిశీలించారు.
1 నుంచి 10 తరగతులు
ఒకే చోట సరికాదు
పార్వతీపురం టౌన్: ఒకటి నుంచి 10వ తరగ తి వరకు తరగతులను ఒకే చోట నిర్వహించడం సరికాదని, వెంటనే ఈ ప్రతిపాదనను ప్రభు త్వం విరమించుకోవాలని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.బాలకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక విలేకరులతో ఆయన శుక్రవారం మా ట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన విద్యా విధానాలు విద్యారంగానికి మేలుచేసే విధంగా ఉండాలే తప్ప నష్టపరచకూడదన్నా రు. రానున్న విద్యాసంవత్సరం నుంచి 1557 పాఠశాలల్లో 1, 2 తరగతులు కూడా కలిపి 1 నుంచి 10 తరగతుల వరకు కొనసాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామన్నారు. రాష్ట్రం మొత్తం 9,200 మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేసి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని నిర్ణయించడం, దాదాపు 700 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయడం మంచిదేనన్నారు. అయితే, ఒక్కో పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని, విద్యార్థుల సంఖ్య 20 దాటితే మూ డో పాఠశాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలలు 6 నుంచి 10 తరగతులు మాత్రమే ఉండాలన్నారు. 30 మందికి ఒక సెక్షన్ ఉంచుతూ ఆంగ్ల, తెలుగు మాధ్యమాలు సమాంతరంగా కొనసాగించాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో కలిపిన 3,4,5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలకు పంపాలన్నారు. ఫౌండేషన్ స్కూళ్ల పేరుతో రాష్ట్రంలోని దాదాపు 5వేల పాఠశాలలను కేవలం 1 ,2 తరగతులతో నిర్వహించడం వల్ల తల్లిదండ్రులు వారి పిల్లలను కేవలం రెండు సంవత్సరాల విద్యకోసం పంపించారని, వాటిని బేసిక్ ప్రైమరీ పాఠశాలలుగా మార్చి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు.
21న కంచి విశ్వవిద్యాలయ ప్రవేశాలు
విజయనగరం: కంచి విశ్వవిద్యాలయ ప్రవేశాలు ఈ నెల 21న విశాఖపట్నం శంకర మఠంలో నిర్వహించనున్నట్టు శ్రీకంచి కామకోటి శంకర మఠం అధ్యక్షుడు డాక్టర్ టి.రవిరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం ద్వారకానగర్ శంకర మఠంలో 21న, 22న విజయనగరంలోని సన్ స్కూల్ ఆవరణలో, అదే రోజు శ్రీకాకుళంలోని గాయత్రి స్కూల్, గీతాంజలి స్కూల్ ఆవరణలోనూ ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనేందుకు యూనివర్సిటీ వీసీ ఆచార్య గుళ్లపల్లి శ్రీనివాస్, వైస్ చాన్సలర్ కె.వెంకటరమణ తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శివనాగజ్యోతి
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శివనాగజ్యోతి