
ఐటీఐలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
● వచ్చే నెల 24వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
విజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ విద్యాలయాల్లో ఆగస్టు–2025 సెషన్‌కు సంబంధించి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ జిల్లా కన్వీనర్ టీవీగిరి మంగళవారం ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు తొలుత ‘ఐటీఐ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్ ద్వారా నేరుగా సదరు వెబ్‌సైట్‌లో సూచనల ప్రకారం మే 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తరువాత వచ్చిన యూనిక్ నంబర్‌తో మే 26వ తేదీ వరకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఐటీఐకి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్లి వెరిఫికేషన్ ప్రాసెస్ చేయించుకోవాలి. అభ్యర్థి ఏ జిల్లాలో అయినా దరఖాస్తు పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. లాగిన్‌లో ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్ నంబర్ టైప్ చేయగానే అభ్యర్థి వివరాలను చూపిస్తుంది. దరఖాస్తు సబ్మిట్ చేసిన వెంటనే, జనరేట్ అయ్యే యూనిక్ నంబర్‌తో కూడిన ప్రింటవుట్‌తో ఏదైనా జిల్లాలో గల ప్రభుత్వ ఐటీఐలో ఒరిజినల్ సర్టిఫికెట్స్‌ను అభ్యర్థులు వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ చేయించుకున్నవారు మాత్రమే కౌన్సెలింగ్‌కు అర్హులవుతారు. వెల్డర్, ప్లంబర్‌లకు 8వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మిగతా అన్ని ట్రేడ్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి 10వ తరగతి పాసై ఉండాలని అభ్యర్థులు గమనించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
రిజిస్ట్రేషన్ సమయంలో గమనించాల్సిన అంశాలు
● అభ్యర్థి ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో మాత్రమే ఐటీఐ వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
● ఒకసారి అడ్మిషన్ పొందిన అభ్యర్ధి అదే మొబైల్ నంబర్‌ను స్కిల్ ఇండియా డిజిటల్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అయ్యేంత వరకు అభ్యర్థి వద్దే ఉండాలి.
● అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, జెండర్ పదవ తరగతి సర్టిఫికెట్ ఆధార్ కార్డులో ఒకే విధంగా ఉండాలి.
● పూర్తి వివరాల కోసం ఫోన్ 9849118075, 9849944654, 7780658035 నంబర్లలో సంప్రదించాలి.