
బాసంగి గదబవలసలో ఏనుగులు
జియ్యమ్మవలస: మండలంలోని బాసంగి పంచాయతీ గదబవలస, గవరమ్మపేట పంచాయతీ వెంకటరాజపురం పంట పొలాలలో ఏనుగులు శనివారం ఉదయం దర్శనమిచ్చాయి. చాలా రోజుల నుంచి పరిసర గ్రామాలలోని పంట పొలాలలో తిరుగుతూ రాత్రి సమయాన గ్రామంలోకి చొచ్చుకు వస్తున్నాయని గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని ఆనుకొని అరటి, పామాయిల్ తోటలతో పాటు వరి పంట ఉండడంతో గ్రామాన్ని వీడడం లేదు. పుష్కలంగా పంటలు, తాగునీరు ఉండడం వల్లే గ్రామాన్ని విడిచిపెట్టడం లేదని రైతులు వాపోతున్నారు. చేతికందుతున్న పంట ధ్వంసం కావడంతో ఏమి చేయాలో తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రయాణాలకు వెళ్లి రాత్రి సమయాన ఇళ్లకు రావడం కష్టంగా ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.