
ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల పంపిణీ
● వేసవి దృష్ట్యా పని వేళల తగ్గింపు : ఎస్పీ
విజయనగరం క్రైమ్: ఎండ వేడి, తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ట్రాఫిక్ సిబ్బందికి ఎస్పీ వకుల్ జిందల్ కిట్లను పంపిణీ చేశారు. నగరంలోని పద్మావతీ నగర్‌లో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం మధ్యాహ్నం 18 మంది ట్రాఫిక్ సిబ్బందికి వాటర్ బాటిల్, హేట్, చిన్న బ్యాగ్‌ను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా సిబ్బంది పని వేళలను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఎండ తీవ్రతతో ట్రాఫిక్ సిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మీరు సక్రమంగా పని చేస్తే నగరం ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఎండ వేడిలో ట్రాఫిక్ సిబ్బంది పడుతున్న ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు పని వేళలను తగ్గించినట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్‌ఐలు భాస్కర్, రవి, రమణ, నూకరాజు, ఏఎస్‌ఐ రాజు, పీసీలు భాస్కర్, రవి, నాయుడు, కిరణ్ పాల్గొన్నారు. కాగా మొత్తం 80 మందికి కిట్లు అందజేశారు. ప్రముఖ వ్యాపార, సేవా సంస్థలైన గోవిందా జ్యూయల్లరీ,ఽ రోటరీ క్లబ్ వారి సహకారంతో వీటిని పంపిణీ చేశారు.