
జెడ్పీలో 10 మందికి పదోన్నతి
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తున్న పది మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. వీరికి ఉత్తర్వులను బుధవారం తన చాంబర్‌లో జెడ్పీసీఈఓ రామచంద్రారెడ్డితో కలసి చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అందజేశారు. అనంతపురంలోని జెడ్పీ కార్యాలయంలో పరిచేస్తున్న డి.మాధవి చౌదరికి పదోన్నతి కల్పిస్తూ తిరిగి జెడ్పీనే కేటాయించారు. ఇదే కార్యాలయంలో పని చేసే బి.సుశీలాదేవిని పెనుకొండలోని పీఆర్ క్యూసీ సబ్ డివిజన్‌కు, కె.రమాదేవిని చిలమత్తూరు మండల పరిషత్ కార్యాలయానికి, విజయవాడలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఎం.అరుణశ్రీని యల్లనూరు మండల పరిషత్ కార్యాలయానికి కేటాయించారు. తొగరకుంట హైస్కూల్‌లో పని చేస్తున్న పి.షాహీనా బేగంను రొద్దం మండల పరిషత్ కార్యాలయానికి, పుట్టపర్తి మండల పరిషత్ కార్యాలయంలో పని చేసే జి.రవీంద్రను పుట్టపర్తి పీఆర్ అనుబంధం పీఐయూ సబ్ డివిజన్‌కు, సిద్ధరాంపురం జెడ్పీహెచ్‌ఎస్‌లో పని చేసే జె.సుబ్రహ్మణ్యంను లేపాక్షి మండల పరిషత్ కార్యాలయానికి పోస్టింగ్ ఇచ్చారు. ఎద్దులపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో పని చేసే పి.ఉమామహేశ్వరరెడ్డిని గుత్తిలోని ఆర్‌డబ్ల్యూఎస్ సబ్ డివిజన్‌కు, నాగసముద్రం జెడ్పీహెచ్‌ఎస్‌లో పని చేసే వి.విశ్వనాథ్‌ను మడకశిర పీఆర్‌ఐ సబ్ డివిజన్‌కు, రాయదుర్గం మండల పరిషత్ కార్యాలయంలో పని చేసే పి.మహేష్ ను కణేకల్లు మండల పరిషత్ కార్యాలయానికి పదోన్నతిపై బదిలీ చేస్తూ ఉత్తర్వులు అందజేశారు.