
మూడు నెలలుగా నీటి సరఫరా బంద్
గాండ్లపెంట: ఎన్‌పీకుంట, గాండ్లపెంట మండలాల్లోని గ్రామాలకు ‘సత్యసాయి మంచినీరు’ మూడు నెలలుగా సరఫరా కావడం లేదు. దీంతో ఈ రెండు మండలాల్లోని 68 గ్రామాల్లో తాగునీటి సమస్య జటిలంగా మారింది. ఆయా గ్రామాలకు సత్యసాయి నీరు సరఫరా చేసేందుకు సీఈఆర్ నుంచి కాళసముద్రానికి అక్కడి నుంచి కుటాగుళ్లకు అక్కడి నుంచి కమతంపల్లికి నీరు సరఫరా చేస్తారు. ఇందుకోసం కమతంపల్లిలో 8.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు సంపులు నిర్మించారు. కానీ మూడు నెలలుగా నీరు సరఫరా చేయడం లేదు. దీంతో గాండ్లపెంట, ఎన్‌పీకుంట మండలాల్లోని జనం తాగునీటికి అల్లాడుతున్నారు.