
మానవత్వం చూపిన పోలీసులు
బత్తలపల్లి: స్థానిక పోలీసులు మానవత్వంతో ఓ వృద్ధుడిని సకాలంలో ఆస్పత్రికి చేర్పించి, ప్రాణాలు కాపాడారు. వివరాలు.. బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామ శివారులోని నార్పలకు వెళ్లే మార్గంలో ఓ చెట్టు కింద గుర్తు తెలియని వృద్ధుడిని వదిలి వెళ్లారనే సమాచారాన్ని అందుకున్న బత్తలపల్లి ఎస్‌ఐ సోమశేఖర్ వెంటనే స్పందించారు. కానిస్టేబుల్ అనిల్‌కుమార్, హోంగార్డు నరసింహులును అక్కడకు పంపి, ఆరా తీయించారు. చెట్టు కింద నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడిని 108 వాహనంలో ఆర్డీటీ ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రజలు పోలీసుల చొరవను అభినందించారు.

మానవత్వం చూపిన పోలీసులు