లైన్‌మెన్‌పై దాడి | - | Sakshi
Sakshi News home page

లైన్‌మెన్‌పై దాడి

Published Fri, Apr 11 2025 1:09 AM | Last Updated on Fri, Apr 11 2025 1:09 AM

లైన్‌

లైన్‌మెన్‌పై దాడి

లేపాక్షి: విద్యుత్‌ బిల్లు చెల్లించాలన్న లైన్‌మెన్‌పై ఓ వినియోగదారుడు దాడికి తెగబడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. లేపాక్షి మండలం పులమతి పంచాయతీ పరిధిలోని ఎస్‌ఆర్‌ఎంయూ కాలనీకి చెందిన ఆసీఫ్‌, షాహీనా విద్యుత్‌ బిల్లు చెల్లించలేదు. గడువు మించి పోవడంతో విద్యుత్‌ కనెక్షన్‌ను కట్‌ చేశారు. గురువారం ఉదయం ఎప్పటి లాగానే విద్యుత్‌ బిల్లు చెల్లించాలని లైన్‌మెన్‌ శివారెడ్డి వెళ్లి అడిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన హసీఫ్‌, షాహీనా లైన్‌మెన్‌పై కట్టెతో దాడి చేయడమే కాక, ఆయన ద్విచక్ర వాహనాన్ని కిందకు పడేసి పగుల గొట్టారు. అక్కడున్న కొందరు స్పందించి ఇరువురుని సర్దిచెప్పి పంపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

డ్రిప్పు పరికరాల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌

బత్తలపల్లి: మండలంలోని సంజీపురం గ్రామానికి చెందిన రైతు అవినేని సూర్యనారాయణ దానిమ్మ తోటలో డ్రిప్పు పరికరాలను అపహరించుకెళుతున్న తలారి నాగరాజును అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ సోమశేఖర్‌ తెలిపాడు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన సిబ్బందితో నిఘా ఉంచామన్నారు. ఈదుల ముష్టూరుకు చెందిన తలారి నాగరాజు.. డ్రిప్పు వైరు కట్టలను ద్విచక్ర వాహనంలో ధర్మవరంలో విక్రయించడానికి తీసుకెళ్లుతుండగా వేల్పుమడుగు క్రాస్‌ వద్ద అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.

గోకులం పాఠశాలను

పరిశీలించిన డీఈఓ

పుట్టపర్తి: మండల కేంద్రంలోని గోకులం ప్రాథమిక పాఠశాలను డీఈఓ కృష్ణప్ప గురువారం తనిఖీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. పాఠాలు బోధించారు. ఈ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా మారుస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఉపాధ్యాయుడు పీవీ రమణారెడ్డి, పాఠశాల సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓలు ఖాదర్‌వలి, ప్రసాద్‌ పాల్గొన్నారు.

సరదాగా రైలు ఎక్కి..

కనిపించకుండా పోయారు

ధర్మవరం అర్బన్‌: స్థానిక కొత్తపేట మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు జస్వంత్‌, విజయ్‌కుమార్‌ గురువారం రైలు ఎక్కి వెళ్లిపోయారు. వారు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు టూ టౌన్‌ సీఐ రెడ్డప్ప తెలిపారు. పోతుకుంట గ్రామానికి చెందిన మల్లికార్జున కుమారుడు జస్వంత్‌, అతని స్నేహితుడు విజయ్‌కుమార్‌ ఇద్దరు కొత్తపేట ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఇద్దరు ఉదయం రైల్వేస్టేషన్‌కు వెళ్లి సరదాగా రైలు ఎక్కారు. ఈ లోపు రైలు ముందుకు కదలడంతో కిందకు దిగలేకపోయారు. బాలురు ఆచూకీ తెలిసిన వారు 63058 00429, 93458 63219, 63029 67673కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

కలెక్షన్‌ సెంటర్లను

వినియోగించుకోండి

ఇక్రిసాట్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌

డాక్టర్‌ పూర్ణచంద్రరావు

శింగనమల: రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కేవీవై) నిధులతో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కలెక్షన్‌ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ఇక్రిసాట్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కె.పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. శింగనమల మండలం వెస్ట్‌ నరసాపురం, శింగనమల గ్రామాల్లో దొనరామేశ్వర రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు నిర్మించిన కలెక్షన్‌ సెంటర్లను థర్డ్‌ పార్టీ వెరిఫికేషన్‌ కింద గురువారం ఆయన పరిశీలించారు. రైతు సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. ఎఫ్‌పీఓ గ్రూప్‌ పరిధిలోని గ్రామాలు, సభ్యుల వివరాలు, పండించే ఉద్యాన, వ్యవసాయ పంటలపై ఆరా తీశారు. పంట ఉత్పత్తునలు గ్రేడింగ్‌ చేసుకుని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునేందుకు కలెక్షన్‌ సెంటర్లు దోహదపడతాయన్నారు. పంట కోత అనంతరం ఉత్పత్తులను మార్కెట్‌లో డిమాండ్‌ వచ్చే వరకూ నిల్వ చేసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో ఏడీఏ రామచంద్ర, ఉద్యానాధికారి శైలజ, రైతు సేవా కేంద్రం సిబ్బంది ఉమాదేవి, అనూష, పవన్‌కుమార్‌, అమరేష్‌, రైతులు పాల్గొన్నారు.

వివాహిత ఆత్మహత్య

గోరంట్ల: మండలంలోని బూదిలి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు విజయ్‌కుమార్‌ నాయక్‌ భార్య అనంతబాయి (49) చేసుకుంది. మార్నింగ్‌ స్కూల్‌ కావడంతో గురువారం ఉదయం విజయ్‌కుమార్‌ నాయక్‌ పాఠశాలకు వెళ్లిపోయారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అనంతబాయి యాసిడ్‌ తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన ఇరుగుపొరుగు వారి సమాచారం మేరకు బంధువులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

లైన్‌మెన్‌పై దాడి 1
1/2

లైన్‌మెన్‌పై దాడి

లైన్‌మెన్‌పై దాడి 2
2/2

లైన్‌మెన్‌పై దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement