
పిడుగుపాటుకు గుడిసె దగ్ధం
పెనుకొండ రూరల్: దుద్దేబండలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రాత్రి 7.30 గంటల సమయంలో రైతు నారాయణప్ప పొలంలోని గుడిసైపె పిడుగు పడింది. పిడుగు ధాటికి గుడిసె దగ్ధమై పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. గుడిసెలోని బియ్యం, బీరువాలోని దుస్తులు, నగదు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేయాలని సూచించారు.
ఎస్పీ కార్యాలయంలో...
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ వి.రత్న తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేస్తే.. పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సూచించారు.
నవ వరుడి ఆత్మహత్యాయత్నం
పామిడి: పైళ్లెన రెండు నెలలకే జీవితంపై విరక్తితో ఓ నవ వరుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పామిడి మండలం కోనేపల్లికి చెందిన పుంజా హరీష్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 21న యాడికి మండలం వెంకటాంపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చంద్ర ప్రభావతితో పెద్దల సమక్షంలో పామిడిలోని రహమత్ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి అయింది. దంపతుల మధ్య ఏమి జరిగిందో? ఏమో తెలియదు కానీ ఆదివారం హరీష్ పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతణ్ని కుటుంబసభ్యులు వెంటనే పామిడిలోని సీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలించినట్లు సమాచారం. ఘటనపై పామిడి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

పిడుగుపాటుకు గుడిసె దగ్ధం