
ఉట్టిపడిన తమిళ సాంస్కృతిక శోభ
ప్రశాంతి నిలయం: సత్యసాయి సన్నిధిలో తమిళ సత్యసాయి భక్తులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తకోటిని మైమరపించారు. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన తమిళనాడు సత్యసాయి యూత్ సభ్యులు శనివారం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం తమిళనాడు సత్యసాయి యూత్ బృందం సంగీత కచేరీ నిర్వహించింది. సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను ఆలరించింది. సాయంత్రం శివభక్తుడైన నందనార్ ఆధ్యాత్మిక చింతన, శివుడిపై అపారమైన భక్తిని వివరిస్తూ బాలవికాస్ చిన్నారులు ‘నందనార్’ పేరుతో నృత్య రూపకం ప్రదర్శించారు. శివుడి దర్శన భాగ్యం కోసం నందనార్ పరితపించిన తీరును చక్కగా వివరించారు. చివరకు నందనార్ భక్తికి మెచ్చిన శివుడు దర్శన భాగ్యం కల్పించిన తీరును కళ్లకు కట్టారు. అనంతరం తమిళ భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

ఉట్టిపడిన తమిళ సాంస్కృతిక శోభ

ఉట్టిపడిన తమిళ సాంస్కృతిక శోభ