అక్రమ కేసులు సరికాదు
నిజాన్ని నిర్భయంగా వేలికి తీసే జర్నలిస్ట్‌లపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పాలకులే అందుకు విరుద్ధంగా వ్యవహరించడం దుర్మార్గం. కూటమి నియంతృత్వ పాలనలో రాష్ట్రంలోని జర్నలిస్టులకు భద్రత కరువైంది. ఇప్పటికై నా జర్నలిస్టులపై వేధింపులు, అక్రమ కేసులు ఆపాలి. లేకపోతే జర్నలిస్టులతో కలిసి ఈ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తాం.
– ఉషశ్రీచరణ్,
జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ


