రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు
పుట్టపర్తి టౌన్: సామాజిక మాధ్యమాల వేదికగా కులమతాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రత్న హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టింగ్‌లపై సోమవారం డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కదిరి డీఎస్పీ శివన్నారాయణస్వామితో కలసి ఎస్పీ మాట్లాడారు. కదిరి ఆర్‌ఐ మున్వర్‌బాషా దొంగ పట్టాలు సృష్టించి ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్న అంశంలో 6 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో రెండు కేసుల్లో ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారన్నారు. అనంతరం కదిరి ఇన్‌స్పెక్టర్‌ను మున్వర్‌బాషా రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు. అలా మాట్లాడడం మంచిది కాదని చెప్పినా వినకుండా మొత్తం అంశాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారన్నారు. వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించిన మున్వర్‌బాషాపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాగే హిందూపురంలోనూ ఓ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో సోషల్ మీడియా సీఐ తిమ్మారెడ్డి, ఎస్‌బీ ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసు నమోదు
తాడిమర్రి: తమ విధులకు ఆటంకం కలిగించారంటూ శివంపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు అల్లే సాయినాథ్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. శనివారం తాడిమర్రిలో లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీజేలో ఆ పార్టీకి చెందిన పాటలు వేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరినా పోలీసులు వినలేదు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు.
సత్తా చాటిన కస్తూరిబా విద్యార్థినులు
పుట్టపర్తి అర్బన్: ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని 30 కస్తూరిబా కళాశాలల విద్యార్థినులు సత్తా చాటారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 877 మంది పరీక్షలు రాయగా, 599 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 641 మంది పరీక్షలు రాయగా 557 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 68 శాతం, రెండో సంవత్సరంలో 87 శాతం ఫలితాలు సాధించినట్లు సమగ్ర శిక్ష జిల్లా కో–ఆర్డినేటర్ దేవరాజ్ తెలిపారు.
జాతీయ హోమియో వైద్యుల సంఘంలో జిల్లా వాసులకు చోటు
అనంతపురం మెడికల్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లా వాసులకు చోటు దక్కింది. ఈ నెల 13న గుంటూరులో అఖిల భారత హోమియో వైద్యుల సంఘం 18వ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సీనియర్ హోమియోపతి వైద్యుడు డాక్టర్ పోగుల కుమారయ్య, రాష్ట్ర విభాగం కో ఆర్డినేటర్‌గా డాక్టర్ ఎం.శాంతిప్రియకు అవకాశం దక్కింది. డాక్టర్ పోగుల కుమారయ్య మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో హోమియో వైద్యం ప్రాముఖ్యత, నూతన ఆవిష్కరణలు, సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు


