
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలకు చెక్
మడకశిర: సీసీ కెమెరాల ఏర్పాటుతో అన్ని రకాల నేరాలకు చెక్ పెట్టవచ్చని ఎస్పీ వి.రత్న అన్నారు. నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. మడకశిరలో దాతల సహకారంతో 32 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను మంగళవారం ఎస్పీ ప్రారంభించి, మాట్లాడారు. మడకశిర నియోజకవర్గంలోని పోలీస్‌స్టేషన్లు అన్నీ కర్ణాటక సరిహద్దులో ఉన్న నేపథ్యంలో సరిహద్దులో నేరాలను అదుపు చేయడానికి సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మడకశిర పట్టణంలో ముఖ్యమైన కూడళ్లు, విద్యాలయాలు, ప్రార్థనా మందిరాలు, జనసంచారమున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు దాతలను అభినందిస్తూ సత్కరించారు. కార్యక్రమంలో పెనుకొండ డీఎస్పీ నరసింగప్ప, ట్రైనీ డీఎస్పీ ఉదయపావని, సీఐలు నాగేష్, రాజ్‌కుమార్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఎస్పీ రత్న