
చాలా ఆనందంగా ఉంది
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన నేను 978 మార్కులు సాధించాను. స్టేట్ టాపర్ల సరసన నిలవడం ఆనందంగా ఉంది. రెండు, మూడేళ్లుగా జూనియర్ కళాశాలల్లో సౌకర్యాలు బాగా మెరుగుపడ్డాయి. అధ్యాపకులు కూడా బాగా బోధిస్తున్నారు. ‘నాడు–నేడు’ పనులతో మా కళాశాల రూపురేఖలు మారాయి. ప్రోత్సహిస్తే ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కూడా సత్తా చాటుతారనేందుకు నేనే ఉదాహరణ.
– నీరుగంటి వాణి,
హిందూపురం జూనియర్ కళాశాల
ఇబ్బందులు లేవు..
అందుకే రాణించా
నేను ఇంటర్‌లో హెచ్‌ఈసీ చదివాను. ఇటీవల వచ్చిన ఫలితాల్లో 851 మార్కులు సాధించాను. మా కళాశాలలో సౌకర్యాలు చాలా బాగున్నాయి. మాకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో చదువుపై దృష్టి సారించగలిగాను. అందుకే ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు దీటుగా రాణించాను. అధ్యాపకులు, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. ప్రభుత్వ విద్య బలోపేతం చేసేందుకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు.
– నీరుగంటి హరిత,
కొత్తచెరువు జూనియర్ కళాశాల

చాలా ఆనందంగా ఉంది