
వైభవంగా జ్యోతుల ఉత్సవం
రొళ్ల: రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి ఉత్సవాల్లో భాగంగా గురువారం జ్యోతుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రొళ్ల మండలం హనుమంతనపల్లి, వన్నారనపల్లి, హులీకుంట, దొమ్మరహట్టి, కొత్తపాళ్యం, కొడగార్లగుట్ట, కొత్తపాళ్యంతాండ, రొళ్లకొండ, అలుపనపల్లి, ఏ.వడ్రహట్టి, దాసప్పపాళ్యం, క్యాతప్పపాళ్యం, వన్నప్పపాళ్యం, జీఎన్ పాళ్యం, బాజయ్యపాళ్యం, పి.గొల్లహట్టి, గొట్టుగుర్కి, రంగనపల్లి, వెంకటంపల్లి తదితర గ్రామాల్లో ఉత్సవాన్ని జరుపుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున జ్యోతులతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు.

వైభవంగా జ్యోతుల ఉత్సవం