
ప్రజాస్వామ్యానికి ముప్పు
కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛపై హరిస్తోంది. నిజాలు నిర్భయంగా రాసే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తోంది. నిజంగా ఇది దారుణం. పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికే ముప్పు. ప్రజాస్వామ్యవాదులంతా ఇలాంటి చర్యలను ఖండించాలి. పాలకులు ఇప్పటికై నా మేల్కోవాలి. వెంటనే సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు మిగిలిన ఆరుగురు జర్నలిస్టులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలి.
– దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి