
సందర్భం : నేటి నుంచి చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు
అమడగూరు: ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద ఉత్సవాలకు పేరొందిన అమడగూరు చౌడేశ్వరీ దేవి ఉత్సవాలకు వేళైంది. దాదాపు ఎనిమిది శతాబ్దాల క్రితం అమరావతిగా పిలువబడిన అమడగూరులో వెలసిన చౌడేశ్వరీ ఆలయానికి ఎంతో విశిష్ట చరిత్ర ఉంది. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ఏటా ఛైత్ర మాసంలో ఆలయ కమిటీ సభ్యులు, అమడగూరు, చీకిరేవులపల్లి, గుండువారిపల్లి గ్రామ పంచాయతీ ప్రజల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవాలను 8 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా నుంచే కాక.. ఏపీలోని పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు.
అమ్మవారి ఉత్సవాల వివరాలు..
ఏటా ఛైత్ర మాసంలో ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారిని 16 గ్రామాల ఊరేగింపునకు తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఆ తర్వాత వచ్చే పున్నమితో ఎప్పటి లాగానే సంప్రదాయ బద్ధంగా నిర్వహించే అమ్మవారి ఉత్సవాలు ఈ ఏడాది కూడా శనివారంతో ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల వివరాలను ఆలయ ధర్మకర్త, మాజీ జెడ్పీటీసీ పొట్టా పురుషోత్తమరెడ్డి వెల్లడించారు. 12న కుంభకూడు, 13న ఊయల సేవ, 14న సూర్యప్రభ, 15న చంద్రప్రభ, 16న శ్రీజ్యోతి ఉత్సవం, 17న అశ్వ వాహనం, 18న సింహ వాహనం, 19న హంస వాహన సేవలు ఉంటాయి.
ఉత్సవాలకే తలమానికంగా..
అమ్మవారి ఉత్సవాలలో భాగంగా ఈ నెల 16న నిర్వహించే శ్రీజ్యోతి ఉత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఉత్సవాన్ని ఏటా కొత్తపల్లికి చెందిన దంపతులు మాజీ జెడ్పీటీసీలు పొట్టా పురుషోత్తమరెడ్డి, ఉమాదేవి కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు 4 రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఆ రోజు ఉట్టి వద్ద నుంచి తీసుకొచ్చే జ్యోతి దర్శనంతో సకల పాపాలు తొలగి మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్నదానంతో పాటు కాలక్షేపానికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
భక్తుల కొంగు బంగారంగా
విరాజిల్లుతున్న చౌడేశ్వరీదేవి
16న శ్రీజ్యోతి ఉత్సవం
భక్తుల కోర్కెలు తీరుతాయి
నమ్మకంతో అమడగూరు చౌడేశ్వరమ్మతో కొలిచే భక్తుల కోర్కెలు తీరుతాయి. ఇందుకు ఎన్నో ఘటనలు ఉన్నాయి. కోర్కెలు తీరిన భక్తులు ఇక్కడి అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు. గత మూడేళ్లుగా ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశాం. ముఖ్యంగా దాతల చేయూత, కమిటీ సభ్యుల సహకారం మరువలేం. త్వరలో ఆలయం వద్ద రోడ్డు విస్తరణ పనులు కూడా పూర్తి చేస్తాం. భక్తుల స్నానమాచరించడానికి కోనేరు నిర్మాణం, విశ్రాంత గదులు, పార్కింగ్ సౌకర్యం తొందర్లోనే ఏర్పాటు చేయనున్నాం. – పొట్టా పురుషోత్తమరెడ్డి, ఆలయ ధర్మకర్త

సందర్భం : నేటి నుంచి చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు

సందర్భం : నేటి నుంచి చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు

సందర్భం : నేటి నుంచి చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు

సందర్భం : నేటి నుంచి చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు