
క్వింటా చింతపండు రూ.19 వేలు
హిందూపురం అర్బన్: క్వింటా చింతపండు గరిష్టంగా రూ.19 వేలు పలికింది. సోమవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 450.60 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలంపాట నిర్వహించారు. ఇందులో కరిపుళి రకం చింతపండు గరిష్టంగా రూ.19 వేలు, కనిష్టంగా రూ. 8,100, సరాసరిన రూ.14 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 12 వేలు, కనిష్టంగా రూ.4,200, సరాసరిన రూ. 8 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు.
15న ‘మడకశిర’లో బలపరీక్ష
● చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌పై
అవిశ్వాస తీర్మానం
● కౌన్సిలర్లు అందరూ
హాజరుకావాలని నోటీసులు
మడకశిర: స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది. అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే 13 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో మే నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. అదేరోజు మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమావేశానికి కౌన్సిలర్లందరూ హాజరు కావాలని సోమవారం అధికారులు నోటీసులు జారీ చేశారు. మడకశిర మున్సిపాలిటీలో 20 వార్డులుండగా... గత ‘స్థానిక’ ఎన్నికల్లో 15 స్థానాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. టీడీపీ ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక మున్సిపల్ పీఠంపై కన్నేసిన టీడీపీ నాయకులు 8 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకున్నారు. అనంతరం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేశారు.
19 మండలాల్లో వాన
పుట్టపర్తి అర్బన్: వాతావరణంలో ఒక్కసారి మార్పులు చోటుచేసుకోగా, ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ జిల్లాలోని 19 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మడకశిరలో 39.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక సీకేపల్లి 17.2, ధర్మవరం 16.4, గుడిబండ 16.2, అగళి 11.4, కనగానపల్లి 10.2, బత్తలపల్లి 9.2, రొళ్ల 7.2, పరిగి 4.2, అమరాపురం 2.6, కదిరి 2.2, రామగిరి 2.2, నల్లచెరువు 2.0, హిందూపురం 1.8, గాండ్లపెంట 1.6, తాడిమర్రి 1.2, బుక్కపట్నం, పుట్టపర్తి మండలాల్లో ఒక సెంటీమీటరు చొప్పున, కొత్తచెరువు మండలంలో 0.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. రాగల నాలుగు రోజులూ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు, జీవాల కాపర్లు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
భారీ వర్షంతో నేలకొరిగిన చెట్లు
పరిగి: మండలంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మోదా, శ్రీరంగరాజుపల్లి, కొడిగెనహళ్లి, పరిగి, తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొడిగెనహళ్లిలో అంధుల ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో పలు చెట్లు నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లపై పడటంతో సేవా మందిరం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో అన్ని గ్రామాల్లో అంధకారం నెలకొంది.
సబ్సిడీతో డ్రిప్పు, స్ప్రింక్లర్లు
పుట్టపర్తి అర్బన్: అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం సబ్సిడీ డ్రిప్పు, స్ప్రింక్లర్ల (2025–26 సంవత్సరానికి) అందిస్తోందని ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్ ఒక ప్రకటనలో తెలిపారు. బోరు బావి ఉన్న రైతులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. డ్రిప్పును సంబంధించి 5 ఎకరాల వరకూ 90 శాతం, 10 ఎకరాల వరకూ 70 శాతం, స్ప్రింక్లర్లకు సంబంధించి 5 ఎకరాల వరకూ 55 శాతం, 5 నుంచి 12.5 ఎకరాల వరకూ 45 శాతం సబ్సిడీ వర్తిస్తుందన్నారు.

క్వింటా చింతపండు రూ.19 వేలు