మద్యం డిపో ప్రారంభం
గోరంట్ల: మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన మద్యం డిపో (ఐఎంఎఫ్‌ఎల్)ను గురువారం రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితతో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్‌కుమార్‌మీనా, రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ డైరెక్టర్ నిశాంత్‌కుమార్, రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలి
పుట్టపర్తి అర్బన్: ప్రతి మహిళా కొంత సొమ్మును పొదుపు చేయడం ద్వారా ఆర్థికంగా ఎదగాలని ఎల్‌డీఎం రమణకుమార్ పేర్కొన్నారు. పుట్టపర్తి వెలుగు కార్యాలయంలో ఆదర్శ రూరల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించే బ్యాంకులు అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సేవింగ్స్ ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రెకరింగ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్లు , ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం అందుబాటులో ఉందన్నారు. ప్రతి మహిళా కొంత సొమ్మును పొదుపు చేస్తే భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాద్, ఆదర్శ సంస్థ అధ్యక్షురాలు లక్ష్మీదేవి, కార్యదర్శి శివానంద, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మద్యం డిపో ప్రారంభం


