
భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ
కదిరి అర్బన్: మండలంలోని కుమ్మరవాండ్లపల్లి నుంచి కదిరి కొండ చుట్టూ సోమవారం శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి భక్తులు గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీనరసింహాస్వామి జన్మ నక్షత్రం సందర్భంగా మహిమ గల ఖాధ్రీ కొండకు గిరి ప్రదక్షిణ చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం.
అగ్ని ప్రమాదాల నివారణపై
అవగాహన తప్పనిసరి
● జిల్లా అగ్నిమాపక శాఖాధికారి
హేమంత్‌రెడ్డి
పుట్టపర్తి టౌన్: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి హేమంత్‌రెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం స్థానిక ఫైర్ స్టేషన్‌లో ఆయన ప్రారంభించి, మాట్లాడారు. విఽధి నిర్వహణలో అమరవీరులైనా ఫైర్‌మెన్లకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 1944, ఏప్రిల్ 14న ముంబైలో జరిగిన అగ్నిప్రమాదంలో (బాంబే డాక్ ఫైర్) మొత్తం 800 మంది మృత్యవాత పడ్డారు. ఇందులో 66 మంది అగ్నిమాపక సిబ్బంది ఉన్నారన్నారు. అప్పటి నుంచి విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన అమర వీరులను స్మరించుకుంటూ అగ్నిమాపక వారోత్సవాలను జరుపుకుంటున్నట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణపై వారం రోజుల పాటు ప్రజలకు వివిధ రూపాల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. 15న జనసంచారిత ప్రాంతాల్లో, విద్యాసంస్థల్లో, గ్యాస్ గోడౌన్లు, పెట్రోల్ బంక్‌లలో వారం రోజుల పాటు అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఏడీఎఫ్‌ఓలు, నాగరాజునాయక్, శంకర్‌ప్రసాద్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ