
వృద్ధుడి అదృశ్యం
రాప్తాడురూరల్: వాకింగ్ కోసం వెళ్లిన ఓ వృద్ధుడు అదృశ్యమైన ఘటన అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాపంపేట శివారులోని ఓవీఆర్ కాలనీకి చెందిన నల్లపరెడ్డి మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వాకింగ్ కోసమని బయటకు వెళ్లాడు. తిరిగి రాలేదు. రాత్రయినా ఇంటికి రాకపోయే సరికి కంగారుపడిన కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికారు. అయినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో బుధవారం కుమారుడు హరినాథరెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.