సంఘాలను బలోపేతం చేస్తాం
తనకల్లు: మహిళా సంఘాలను బలోపేతం చేయనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య తెలిపారు. స్థానిక చౌడేశ్వరీ మహిళా సమాఖ్య కార్యాలయంలో గురువారం రైతు ఉత్పత్తిదారుల ఎఫ్‌పీజీ లీడర్ల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చిరుధాన్యాల సాగును ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. వేరుశనగ పంటకు మార్కెట్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరానగర్‌లోని కల్పన మహిళా సంఘం యాక్షన్ ప్లాన్ గురించి సభ్యులతో మాట్లాడారు. వివిధ రకాల జీవనోపాధులకు అవకాశం ఉండేలా యాక్షన్ ప్లాన్‌ను తయారు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీహెచ్‌ఓ చంద్రశేఖర్, డీపీఎంఎల్‌హెచ్ రామమోహన్, ఏపీఓ మరియమ్మ, ఏపీఎం జయంతి, హెచ్‌ఓ లావణ్య, ఎఫ్‌పీఎం ఏపీఎం రమణప్ప, సీసీ, పలువురు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


