ఖాద్రీశా.. గోవిందా
● ఖాద్రీశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి, వారాంతపు సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఖాద్రీశున్ని స్మరిస్తూ గోవింద నామ స్మరణ చేయగా..ఆ ప్రాంతం మార్మోగింది. ఆలయ కమిటీ భక్తులకు అన్నదానం చేసింది. సాయంత్రం వేళ మహిళలు దీపాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు.


