
అందరూ ఆయనకే వత్తాసు
పేదలపై ఎందుకు కక్ష?
మా పొలాలకు దారి కావాలని పదేళ్లుగా పోరాడుతున్నాం. ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చాం. తహసీల్దార్ సారు వాళ్లు ఒకసారి వచ్చి చూసి వెళ్లారు. దారి ఉందని చెప్పారు. అయితే రెడ్డెప్పశెట్టి దారి ఇవ్వడం లేదు. ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టిస్తాడు. మాకా వయసైపోతోంది. పైగా పేదవాళ్లం. కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక, ఆర్థిక స్తోమత రెండూ లేక న్యాయం కోసం ఎదురుచూస్తున్నాం.
– చలపతి, రైతు, దోరణాలపల్లి
మాకు రెండెకరాల పొలం ఉంది. ఆ స్వామి(రెడ్డప్పశెట్టి)ని మేము అడిగింది పొలాలకు వెళ్లేందుకు దారి ఇవ్వండి అని. పంటలు సాగుచేసుకొని జీవనం సాగిస్తున్న మాలాంటి వారిపై దేనికి అంత కక్ష? మా భూములూ ఇచ్చేస్తాం.. ఆయనే ఏలుకోమని చెప్పండి. అంత దూరం నడవలేక, పంటలను సరిగా చూసుకోలేక దిగుబడులు రావడం లేదు. మాకు న్యాయం చేయండి.. దారి ఇప్పించండి.
– మునీశ్వరమ్మ, దోరణాలపల్లి

అందరూ ఆయనకే వత్తాసు