వాహనం ఢీ – బైక్ రైడర్ మృతి
పెద్దవడుగూరు: వాహనం ఢీకొన్న ఘటనలో బెంగళూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... బెంగళూరులోని హెబ్బాల్‌లో వినాయక్‌నగర్ ఫోర్త్‌క్రాస్‌లో నివాసముంటున్న మహేష్‌కుమార్ (47)కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. బైక్ రైడింగ్‌పై ఆసక్తి ఉన్న ఆయన వారం రోజుల క్రితం తన స్నేహితులతో కలసి ద్విచక్ర వాహనాలపై సిక్కింకు వెళ్లారు. ఈ క్రమంలో తిరుగు ప్రయాణమై ఈ నెల 9న హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఇదే విషయాన్ని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తెలిపారు. బుధవారం వేకువజామున హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఒంటరిగా ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఆయన గురువారం ఉదయం పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన పడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పెద్దవడుగూరు పీఎస్ ఎస్‌ఐ ఆంజనేయులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, సమాచారం అందజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వాహనం ఢీ – బైక్ రైడర్ మృతి


