
కొబ్బరిచెట్టుపై పిడుగు
చిలమత్తూరు: కనిశెట్టిపల్లిలో శుక్రవారం రాత్రి ఓ ఇంటి సమీపాన కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. భారీ శబ్దానికి గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామంలో పలువురు స్పృహ కోల్పోయారు.
కులం పేరుతో దూషించిన వ్యక్తిపై కేసు
ధర్మవరం అర్బన్: జూనియర్ లైన్‌మెన్‌ను కులం పేరుతో దూషించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని జగ్జీవన్ రామ్‌నగర్‌కు చెందిన సాకే దినేష్ జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. శనివారం ఇందిరమ్మ కాలనికి చెందిన నిట్టూరు సుబాన్ అనే వ్యక్తికి ఫోన్ చేసి కరెంటు బిల్లు కట్టాలని కోరాడు. ఇందుకు ఆగ్రహించిన సుబాన్ జూనియర్ లైన్‌మెన్‌ను కులం పేరుతో దూషించాడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జూనియర్ లైన్‌మెన్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సుబాన్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు.
గుర్తుతెలియని
యువకుడి మృతి
ధర్మవరం అర్బన్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడని వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. మృతుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లేదా 94407 96831, 94405 52808, 94407 32538 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

కొబ్బరిచెట్టుపై పిడుగు