నాయకుడంటే జగనే.. | For repairing the continuous | Sakshi
Sakshi News home page

నాయకుడంటే జగనే..

Published Tue, Nov 8 2016 2:06 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

నాయకుడంటే జగనే.. - Sakshi

నాయకుడంటే జగనే..

ప్రజల బాగు కోసం నిరంతరం పరితపిస్తున్నారు
వైఎస్సార్ సీపీ మహిళానేత, మాజీ కార్పొరేటర్ గరికిన గౌరి

విశాఖపట్నం : ప్రజల కోసం నిరంతరం పరితపిస్తుంటారు.. ప్రజల తరపున ప్రభుత్వంపై నిత్యం పోరాడుతున్నారు.. నాయకుడంటే జగనే.. ఆయన నాయకత్వంలో ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్ సీపీలో చేరాను’’ అని మాజీ కార్పొరేటర్ గరికిన గౌరీ అన్నారు. తన సహచరులతో కలసి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరిన విషయం విదితమే. సోమవారం ఆమె ’సాక్షి’తో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లో ప్రజల సంక్షేమం కోసం పాటు పడ్డానని, ఇప్పుడు వైఎస్సార్ సీపీ ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వాలని పార్టీలో చేరానని వివరించారు.

తనతోపాటు కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం వార్డు అధ్యక్షురాలు గాలి పార్వతి, యువజన కాంగ్రెస్ నాయకుడు గరికిన కొండబాబు , మైనార్టీ సెల్ ప్రతినిధి భరతుల్లాల, పలువురు కార్యకర్తలు నడిచి వచ్చారని చెప్పారు. మరికొంత మంది వైఎస్సార్ సీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement