రాంచీకి చెందిన సినీ నిర్మాత అజయ్ కుమార్ సింగ్ నుంచి తాను తీసుకున్న రూ.2.50 కోట్లకు వడ్డీతో కలిపి రూ. 2.75 కోట్లు తిరిగి చెల్లిస్తానని బాలీవుడ్ నటి అమీషా పటేల్ తెలిపింది. చెక్ బౌన్స్, మోసం కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి అమీషా పటేల్ చిత్ర నిర్మాత అజయ్ కుమార్ సింగ్‌కు డబ్బు చెల్లించేందుకు ఎట్టకేలకు అంగీకరించారు. రాంచీ కోర్టు ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆమె ఒప్పుకుంది.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త అజయ్ కుమార్ ఓ సినిమా విషయంలో చాలా నెలల క్రితం అమీషా పటేల్‌పై చెక్ బౌన్స్ కేసు వేశారు. సినిమా నిర్మిస్తానంటూ తన దగ్గర నుంచి రూ. 2.5కోట్లు అప్పుగా అమీషా పటేల్ తీసుకున్నారని.. ఆ తర్వాత సినిమా పూర్తిచేయకపోగా తన డబ్బులు తిరిగి ఇవ్వలేదని పేర్కొంటు రాంచీలోని సివిల్ కోర్టులో పిటిషన్ ఆయన వేశారు. వడ్డీతో కలిసి మొత్తం రూ.3కోట్లు అయిందని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. ఆ డబ్బును ఇప్పించాలని కోర్టును కోరారు.
ఈ కేసు విషయంలో తాజాగా అమీషా పటేల్ తన లాయర్ ద్వారా డబ్బు చెల్లించేందుకు అంగీకరించింది. అయితే మొదటి విడతగా రూ.20 లక్షలు చెల్లిస్తామని లాయర్ ద్వారా కోర్టుకు తెలిపింది. కోర్టు వర్గాల సమాచారం ప్రకారం, అమీషా పటేల్ మొదటి విడత మొత్తాన్ని మరో రెండు మూడు రోజుల్లో అందించనున్నట్లు తెలిపింది. అంతకుముందు, కోర్టు స్వయంగా విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించింది. అయితే వ్యక్తిగత విధుల కారణంగా కోర్టుకు హాజరుకాలేనని అమీషా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment