హీరోయిన్‌పై చీటింగ్‌ కేసు అయినా బికినీలో రిలాక్స్‌ అవుతున్న బ్యూటీ! | Police Case Filed Against Actress Ameesha Patel for Cheating Case | Sakshi
Sakshi News home page

Ameesha Patel: బద్రి భామపై చీటింగ్‌ కేసు, బికినీ ఫొటోలు వైరల్‌

Published Tue, Apr 26 2022 1:24 PM | Last Updated on Tue, Apr 26 2022 1:57 PM

Police Case Filed Against Actress Ameesha Patel for Cheating Case - Sakshi

టసేపు ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమె నిర్వాహకుల నుంచి రూ.4 లక్షలు వసూలు చేసింది. తీరా ప్రాగ్రామ్‌కు వచ్చిన తర్వాత కేవలం మూడు నిమిషాలే స్టేజీపై కనిపించి మాయమైంది. దీంతో అమీషా మోసం చేసిందంటూ ప్రోగ్రాం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బద్రి, నాని సినిమాలతో తెలుగువారికి పరిచయమైంది హీరోయిన్‌ అమీషా పటేల్‌. బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన అమీషా మీద తాజాగా చీటింగ్‌ కేసు నమోదైంది. పోలీసులకందిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ కార్యక్రమం కోసం నిర్వాహకులు అమీషా పటేల్‌ను సంప్రదించారు. గంటసేపు ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమె రూ.4 లక్షలు వసూలు చేసింది. తీరా ప్రాగ్రామ్‌కు వచ్చిన తర్వాత కేవలం మూడు నిమిషాలే స్టేజీపై కనిపించి మాయమైంది. దీంతో అమీషా మోసం చేసిందంటూ ప్రోగ్రాం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో అమీషా ఈ విషయంపై ట్విటర్‌ వేదికగా స్పందించింది. ఏప్రిల్‌ 23వ తారీఖు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా సిటీలో నవచండీ మహోత్సవాలకు హాజరయ్యాను. స్టార్‌ ఫ్లాష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, అరవింద్‌ పాండే ఈ కార్యక్రమాన్ని చాలా దారుణంగా నిర్వహించారు. నాకు ప్రాణభయం పట్టుకుంది, కానీ స్థానిక పోలీసులు నా రక్షణ బాధ్యతలు చూసుకున్నారు అని ట్వీట్‌ చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గడర్‌ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న అమీషా ఢిల్లీలో ఎంజాయ్‌ చేస్తోంది. ఓ చెట్టు కింద బికినీ ధరించి నిల్చున్న ఆమె ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

చదవండి: పెళ్లి చేసుకున్న టీవీ నటి రష్మీ, ఫొటోలు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement