ఓటీటీలో ఏముందని? అంతా గే, స్వలింగ సంపర్కానికి సంబంధించిన కంటెంట్‌తోనే నిండిపోయింది. అంతకుమించి అక్కడేం లేదు అని నటి అమీషా పటేల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా నటి వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఉర్ఫీ జావెద్ ఫైర్ అయింది. 'అసలు గేయిజం, లెస్బియినిజం అంటే అర్థం తెలుసా? మీ పిల్లలను వాటికి దూరంగా ఉంచాలనుకుంటున్నారా?
ఇలాంటి తారలు ఇటువంటి సున్నితమైన అంశాల గురించి ముందుగా కొంత చదువుకుని వచ్చి మాట్లాడితే బాగుంటుంది. అలా కాకుండా ఏదీ తెలియకపోయినా ఏదో ఒకటి వాగితే నాకు చెడ్డ చిరాకు పుడుతుంది. బహుశా 25 ఏళ్లుగా ఏ పనీ దొరక్కపోవడం వల్ల ఆమె ఇలా తయారైనట్లుంది' అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా అమీషా పటేల్ త్వరలో గదర్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు, సిరీస్‌లు కుటుంబమంతా కలిసి చూసేలా ఉండట్లేదు.
కానీ మా సినిమా మాత్రం అమ్మమ్మ-తాతయ్యలతోనూ కలిసి చూడవచ్చు. జనాలు ఒక మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో కలిసి సినిమా చూసే రోజులు పోయాయి. ఓటీటీలో అయితే అసలే చూడలేం. ఓటీటీలో స్వలింగ సంపర్కం, గేకు సంబంధించిన సన్నివేశాలే ఉంటున్నాయి. పిల్లలతో కలిసి చూడలేని అభ్యంతరకర రీతిలో కంటెంట్ ఉంటోంది. ఒక మంచి సినిమా కావాలని కోరుకుంటున్న ప్రేక్షకులకు గదర్ 2 తప్పకుండా ఒక మంచి సమాధానం అవుతుంది అని చెప్పుకొచ్చింది ఉర్ఫీ జావెద్. కాగా 2001లో వచ్చి గదర్: ఏక్ ప్రేమ్ కథ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కానుంది.
చదవండి: నైట్ క్లబ్‌లో హీరోయిన్‌తో ముద్దులాట.. హీరో ప్రైవేట్ వీడియో లీక్
Comments
Please login to add a commentAdd a comment