Serial Actress Devoleena Bhattacharjee Reacts On Rumours About Pregnancy Before Marriage - Sakshi
Sakshi News home page

Devoleena Bhattacharjee: గర్భం దాల్చడంతో సడన్‌గా పెళ్లి అంటూ ట్రోలింగ్‌.. నటి ఏమందంటే?

Published Sat, Dec 24 2022 3:03 PM | Last Updated on Sat, Dec 24 2022 4:16 PM

Devoleena Bhattacharjee: They Cant See Anyone Happy - Sakshi

'కోడలా కోడలా కొడుకు పెళ్లామా' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది హిందీ బుల్లితెర నటి దేవలీనా భట్టాచార్జి. ఇటీవల సడన్‌గా పెళ్లి చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్‌ చేసిందామె. ఆర్భాటంగా చేసుకోవాల్సిన పెళ్లిని అంత నిరాండబరంగా హడావిడిగా పూర్తి చేసేసిందంటే దీని వెనక ఏదో జరిగిందని కొందరు అనవసర అపోహలకు పోయారు. బహుశా తను గర్భం దాల్చి ఉంటుందని అందుకే గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుందంటూ ఆమెను నిందించారు. తాజాగా ఈ విమర్శలపై నటి దేవలీనా స్పందించింది.

'ఎవరికీ నేను సమాధానం చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ గర్భం దాల్చడం వల్లే ఇలా సడన్‌గా పెళ్లి చేసుకున్నానని అంటుంటే షాకింగ్‌గా ఉంది. మరీ ఇంత దారుణంగా మాట్లాడతారా అని బాధేసింది. అవతలి వాళ్ల సంతోషాన్ని నాశనం చేసేందుకు ఎంతకైనా తెగిస్తారా? కొన్నిసార్లు ఇలాంటి మాటల వల్ల కోపం, బాధ రెండూ వస్తాయి. ఒకరి జీవితాన్ని చెదరగొట్టడానికి ఎలా మనసొప్పుతుందో? అయినా వీటిని నేను పెద్దగా పట్టించుకోను' అని చెప్పుకొచ్చింది దేవలీనా. కాగా డిసెంబర్‌ 14న ఆమె జిమ్‌ ట్రైనర్‌ షాన్వద్‌ షైఖ్‌ను పెళ్లాడింది.

చదవండి: ఇక నా పని అయిపోందనుకున్నా.. : తమన్నా
హరిహర వీరమల్లులో బాలీవుడ్‌ స్టార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement