
శ్రేయ కోట్స్
జీవితం గజిబిజిగా అనిపిస్తున్నప్పుడు, కాస్త ఆగి ఆలోచించాలి. అప్పుడు మన ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. అందరూ మనల్ని కావాలనుకోవడం బాగుంటుంది. ఎవరికీ అందుబాటులో లేకుండా ఉండడం ఇంకా బాగుంటుంది. నాకు స్వీట్లు ఇష్టం ఉండవు. కాదు కూడదు తీసుకోవాల్సిందే అంటే రసమలైని ఎంచుకుంటాను.
మన తపన మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళుతుంది. నేను సన్నగా ఉండను. సన్నగా కనిపించే దుస్తులు వేసుకుంటాను. రుచికరమైన ఆహారం మనలోని డిప్రెషన్‌ని పోగొట్టి, మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. (శ్రేయ ఘోషాల్ సినీ నేపథ్య గాయని. బెంగాలీ అమ్మాయి. దాదాపు అన్ని భారతీయ భాషలలో ఆమె పాటలు పాడారు.) ఇవాళ శ్రేయ బర్త్‌డే.