69వ సినీ జాతీయ అవార్డుల వివరాలను కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. ఇందులో తమిళ చిత్ర పరిశ్రమ నాలుగు అవార్డులను గెలుచుకోవడం, అవన్నీ చిన్న చిత్రాలు కావడం మరింత విశేషం. మణికంఠన్ దర్శకత్వం వహించిన కడైసి వ్యవసాయి చిత్రం ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. అదే విధంగా ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన (లేట్) నల్లుండికి ప్రత్యేక అవార్డును ప్రకటించింది.
పార్తీపన్ కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన ఇరైవిన్ నిళల్ చిత్రంలోని మాయవా ఛాయవా అనే పాటను పాడిన శ్రేయ ఘోషల్‌ను ఉత్తమగాయని అవార్డు వరించింది. కాగా ఈవీ గణేష్ బాబు దర్శకత్వం వహించిన కరువరై చిత్రానికి గాను సంగీత దర్శకుడు శ్రీకాంత్ దేవాకు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వరించింది.
(ఇదీ చదవండి: 2023 :అల్లు అర్జున్... ఉత్తమ నటుడు)
ఈ సందర్భంగా తన చిత్రంలోని పాటకు గాను ఉత్తమ గాయని అవార్డును ప్రకటించిన అవార్డుల కమిటీకి నటుడు పార్తీపన్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. కాగా తెలుగు తేజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆస్కార్ అవార్డు కొల్లగొట్టిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఈసారి ఏకంగా 6 ప్రధాన అవార్డులను దక్కించుకోవడం విశేషం.
ఉత్తమగాయనిగా శ్రేయ ఘోషల్‌కు జాతీయ అవార్డు తెచ్చిన పాట ఇదే...
Comments
Please login to add a commentAdd a comment