తొలిసారిగా కుమారుడి ఫొటో షేర్‌ చేసిన శ్రేయా ఘోషల్‌ | Singer Shreya Ghoshal Shares Her Son Picture First Time | Sakshi
Sakshi News home page

తొలిసారిగా కుమారుడి ఫొటో షేర్‌ చేసిన శ్రేయా దంపతులు

Published Wed, Jun 2 2021 3:44 PM | Last Updated on Wed, Jun 2 2021 6:37 PM

Singer Shreya Ghoshal Shares Her Son Picture First Time  - Sakshi

ప్రముఖ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ మొదటి సారిగా తన కుమారుడు ఫొటోను షేర్‌ చేశారు. ఇటీవల తనకు పడ్డంటి మగ బిడ్డ జన్మించినట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించిన ఆమె  చిన్నారి ఫొటోను మాత్రం షేర్‌ చేయలేదు. దీంతో ఆమె కుమారుడిని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు, ఫాలోవర్స్‌కు తాజాగా శ్రేయా సర్‌ప్రైజ్‌ అందించారు. తన భర్త శిలాదిత్యతో కలిసి తమ ముద్దుల తనయుడిని ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ కుమారుడిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా తన తనయుడికి దేవ్యాన్‌ ముఖోపాధ్యాయగా నామకరణం చేసినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఇందులో దేవ్యాన్‌ ముఖం మాత్రం కనిపించకుండా వారు జాగ్రత్త పడ్డారు.   

గత నెల మే 22న శ్రేయా ఘోషల్‌ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా శ్రేయా చిన్నారి దేవ్యాన్‌ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఇంట్రడ్యూసింగ్‌ దేవ్యాన్‌ ముఖోపాధ్యాయ. అతను మే 22న మా జీవితంలోకి వచ్చాడు. అతడి రాకతో మా హృదయాలు ఒక రకమైన ప్రేమను నింపాడు. ఒక తల్లి, ఒక తండ్రి మాత్రమే ఇలాంటి మధురమైన అనుభూతిని పొందగలరు. స్వచ్చమైన, హద్దులు లేని ప్రేమకు ఈ చిన్నారి దేవ్యాన్‌ నిదర్శనం’ అంటు ఆమె మురిసిపోయారు. 


చదవండి:
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్‌ శ్రేయా ఘోషల్ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement