‘భీష్మ’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లుగా శనివారం చిత్రయూనిట్ ప్రకటించింది.
‘‘ఈ మూవీలో నితిన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కోసం కేతికా శర్మ చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను అతి త్వరలోనే రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.
Comments
Please login to add a commentAdd a comment