అలాంటి సినిమాలు...హిందీలో చేస్తా! | raviteja about hindi movies and he's upcoming movie robbinhood | Sakshi
Sakshi News home page

అలాంటి సినిమాలు...హిందీలో చేస్తా!

Apr 14 2016 10:56 PM | Updated on Sep 3 2017 9:55 PM

అలాంటి సినిమాలు...హిందీలో చేస్తా!

అలాంటి సినిమాలు...హిందీలో చేస్తా!

చంటిగాడు లోకల్... నేను కాలు పెడితే మీ దరిద్రం దూల తీరిపోద్ది... వంటి డైలాగులు థియేటర్లో వినపడితే మాస్ ప్రేక్షకుల సందడికి కొదవ ఉండదు.

చంటిగాడు లోకల్... నేను కాలు పెడితే మీ దరిద్రం దూల తీరిపోద్ది... వంటి డైలాగులు థియేటర్లో వినపడితే మాస్ ప్రేక్షకుల సందడికి కొదవ ఉండదు. చప్పట్లు, విజిల్స్ హోరుతో హాలు మార్మోగిపోతుంది. ఆ రేంజ్‌లో మాస్‌ని ఆకట్టుకునే ఏ ఆర్టిస్ట్‌కైనా తిరుగుండదు. అందుకే మాస్‌లో రవితేజ తిరుగులేదనిపించుకున్నారు. వెరైటీ స్టైల్‌లో డైలాగులు చెప్పడం, వెరైటీ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకోవడం రవితేజకు బాగా తెలుసు. ఇంతకీ ఈ హీరోగారు ఇప్పుడేం చేస్తున్నారు? నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్’ అనే సినిమాతో రెడీ అవుతున్నారు.

తెలుగులో రకరకాల పాత్రలు చేసి, మెప్పించిన రవితేజకు వేరే భాషలో సినిమా చేసే ఉద్దేశం లేదా? ‘బాహుబలి’ ద్వారా ప్రభాస్, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో పవన్ కల్యాణ్ పరిచయమైనట్లు హిందీ తెరకు పరిచయం కావాలని అనుకోవడం లేదా? అసలు హిందీలో స్ట్రయిట్ సినిమాకి అవకాశం వస్తే చేస్తారా? ‘చేస్తా’ అంటున్నారు రవితేజ. అయితే ఇప్పటివరకూ తెలుగులో చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే పాత్రలైతేనే హిందీ చిత్రాలు చేస్తానని రవితేజ పేర్కొన్నారు.

ముఖ్యంగా ఈ మధ్య విడుదలైన ‘కీ అండ్ కా’, ‘కపూర్ అండ్ సన్స్’ వంటి సినిమాలైతేనే హిందీకి ‘సై’ అంటానని స్పష్టం చేశారు. తెలుగులో చేసినట్లుగానే రెగ్యులర్ యాక్షన్, కామెడీ మూవీస్ చేయాల్సి వస్తే... అదేదో ఇక్కడే చేయొచ్చు కానీ, ఇలాంటి చిత్రాలే చేయడానికి హిందీ రంగానికి వెళ్లాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. సో.. హిందీలో వెరైటీ సబ్జెక్ట్‌తో ఎవరైనా మాస్ మహరాజ్‌ని సంప్రతిస్తే.. హిందీకి ఎగరేసుకు పోవచ్చన్న మాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement