Hindi films
-
హిందీ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు: మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అందరూ స్టార్ హీరోలు హిందీ సినిమాలు చేస్తున్నారు. మరి మీరెప్పుడు డైరెక్ట్ హిందీ సినిమా చేస్తున్నారు? అని జర్నలిస్ట్ అడగ్గా.. 'బాలీవుడ్ జనాలను మెప్పించాలంటే హిందీలో సినిమా చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో సినిమాలు తీసినా చాలు. ఇప్పుడు తెలుగు చిత్రాలను ప్రపంచమంతా చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతోంది అదే. అలాంటప్పుడు నువ్వైనా సరే తెలుగు సినిమాలు చేస్తే చాలనుకుంటావు అంటూ తనదైన పంచ్ డైలాగ్‌తో ఆన్సరిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవలె బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం రీసెంట్గా తాను తాను హిందీలో తప్ప మరే ఇతర భాషల్లో నటించనంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వాళ్లకు మహేష్ సైలెంట్‌గా కౌంటర్ వేశారంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Mahesh Babu Reply To Media About His Bollywood Entry. pic.twitter.com/T8iJlJ1487 — Naveen MB Vizag 🔔 (@NaveenMBVizag) April 6, 2022 -
ముస్లింల దేశభక్తికి ఇన్ని పరీక్షలా?
ఉగ్రవాదిగా మరణించిన తమ కుటుంబసభ్యుని శవాన్ని తీసుకోవడానికి అత్యంత దేశభక్తిగల కొన్ని ముస్లిం కుటుంబాలు నిరాకరిస్తున్న కారణంగానే దేశం ఇంకా మంటల్లో చిక్కుకోలేదా? అంటే ఇదొక్కటే కారణం కాదని తాజా హిందీ సినిమా ‘ముల్క్’ చెబుతోంది. ఈ సినిమాలో నాకు నచ్చిన అత్యంత సాహసవంతమైన అంశం ఏమంటే– ముస్లింలలో అత్యుత్తమ గుణాలున్నవారిని మాత్రమే చూపించడాన్ని ప్రశ్నించడం. ఇక్కడే దర్శకుడు అనుభవ్ సిన్హా ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక్కడ చెప్పిన దేశభక్తులు మాత్రమే గొప్పవాళ్లు కాదనీ, అత్యధిక ముస్లింలు కూడా వారిలాంటి బుద్ధిమంతులని ఆయన ముల్క్ ద్వారా చెప్పారు. ప్రతి ఏడుగురు భారతీయుల్లో ఒకరు ముస్లిం. ఈ లెక్కన 2021 జనాభా లెక్కల్లో వారి సంఖ్య 20 కోట్లు దాటిపోతుంది. భారతదేశపు అత్యంత విజయవంతమైన సృజనాత్మక పరిశ్రమ సినిమారంగంలో ముస్లింల శాతం జనాభాలో వారి నిష్పత్తి కన్నా ఎక్కువే. మన చిత్ర పరిశ్రమలో ప్రతి ఏడుగురు ఉత్తమ నటులు, సంగీత దర్శకులు, పాటల రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్లో ముస్లింలు ఒకరి కంటే ఎక్కువ మందే ఉన్నారు. భారత సినిమా పరిశ్రమలో ముఖ్యంగా హిందీ సినిమాల్లో ముస్లింల కథాంశంతో నిర్మించే చిత్రాలు బాగా తక్కువ. చాలా అరుదుగా ముస్లింలు ప్రధాన పాత్రధారులుగా తీసే సినిమాల్లో వారిని చాలా మంచి మనుషులుగా లేదా నిజంగా చెడ్డవారిగా చూపిస్తారు. అందుకే అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన తాజా హిందీ చిత్రం ‘ముల్క్’ పైన చెప్పిన ముస్లిం సినిమాలకు భిన్నంగా ఉంది. హిందీ సినిమాల్లో ముస్లిం పాత్రలు హిందీ సినిమాల్లో ముస్లింలను చిత్రించిన తీరును బట్టి ఈ తరహా చిత్రాలను మూడు దశల్లో వచ్చినవిగా అంచనా వేయవచ్చు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1960ల వరకూ మొఘల్ చరిత్రకు సంబంధించిన ప్రముఖుల కథల ఆధారంగా వరకూ తీసిన సినిమాలే ఎక్కువ. తాజ్‌మహల్, ముఘలే ఆజం, రజియా సుల్తానా వంటివి ఈ తరహా సినిమాలు. అదే కాలంలో మేరే మెహబూబ్ నుంచి పాకీజా వరకూ నిర్మించిన ‘ముస్లిం సాంఘిక’ సినిమాల్లో ప్రేమ, కవిత్వం, భూస్వామ్యవర్గం ఆడంబరాలు వంటి అంశాలతో నిండి ఉన్నాయి. 1970ల్లో ముస్లింలను ‘ఆగ్రహంతో ఉన్న యువకుల’ లక్షణాలతో చూపిస్తూ హిందీ సినిమాలు వచ్చాయి. ఈ రకం సినిమాల్లో విశాల హృదయంతో, నిజాయితీతో ధైర్యసాహసాలు ప్రదర్శించే ముస్లిం పాత్రధారులు చివర్లో దేశం కోసం, తమ హిందూ స్నేహితుల కోసం ప్రాణాలు అర్పించడం చూశాం. 1973లో ప్రకాశ్‌మెహ్రా తీసిన ‘జంజీర్’ షేర్‌ఖాన్ పాత్రలో ప్రాణ్ ఇందులో తన మిత్రుడు, హీరో అమితాబ్ బచ్చన్‌ను ఉద్దేశించి ‘యారీ హై ఈమాన్ మేరా, యార్ మేరా జిందగీ’ అంటూ పాడిన పాట పై అంశానికి అద్దం పడుతోంది. 1980ల చివరి వరకూ వచ్చిన హిందీ చిత్రాల్లోని ముస్లింలు దాదాపుగా మంచివాళ్లుగానే ఉంటారు. అరుదుగా దుష్టపాత్రల్లో కనిపిస్తారు. తర్వాతి దశలో తీరు మారింది. దీన్ని హిందీ సినిమాల్లో సన్నీ దేవల్ దశగా పిలుద్దాం. దేశంలో మతతత్వం పెరుగుతున్న ఈ కాలంలో ముస్లింలను చెడ్డవాళ్లుగా, ఎక్కువగా ఉగ్రవాదులుగా చిత్రిస్తూ సినిమాలు వచ్చాయి. అప్పటి సినిమాల్లో ఒకటైన ‘జాల్’(వల)లో హీరో సన్నీ దేవల్ మంచి మనిషిగా దుష్టులకు(వారంతా ముస్లింలే) గుణపాఠం చెబుతాడు. ఆ సమయంలో వెనుక నుంచి ‘ఓం నమః శివాయ’ అనే మాటలు బిగ్గరగా వినిపిస్తారు. ముస్లింలు అంటే దుష్టులు వస్తున్నప్పుడు సమీపంలోని మసీదు నుంచి ముస్లింలకు నమాజు చేయాలని కోరే పిలుపు ‘అజా’ వస్తుంది. దేశభక్తి గల కథానాయకుని భార్య పాత్రలో టబూ నటించింది. ఆమె భర్తకు ద్రోహం చేసినట్టు ఈ సినిమాలో చూపించారు. దేవల్ హీరోగా చేసిన ఇలాంటిదే మరో చిత్రం ‘ద హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై’(గూఢచారి ప్రేమకథ అని అర్ధం). ఇందులో దేవల్ ముస్లిం భార్యగా ప్రియాంకా చోప్రా నటించింది. భర్త దుష్టులైన ముస్లింలతో పోరాడుతుంటే, ఆమె భర్త కోసం ప్రాణ త్యాగం చేస్తుంది. గదర్ ఏక్ ప్రేమ్ కథా అనే చిత్రం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంత మతవిద్వేషంతో కూడిన హిందీ సినిమా ఏదీ అప్పటి వరకూ రాలేదని అప్పటి ఎడిటర్ ఎంజే అక్బర్ నాతో అన్నారు. అప్పటి నుంచి మళ్లీ ట్రెండ్ మారింది. ముస్లింలను దుర్మార్గులుగా చిత్రించారు ఇస్లాం అంటే భయపడే రోజుల్లో ముస్లింలను దుర్మార్గులుగా చిత్రించిన సినిమాలకు గిరాకీ పెరిగింది. కశ్మీర్లో ఉగ్రవాదం, అల్ కాయిదా, ఇండియన్ ముజాహదీన్ కార్యకలాపాలు ఎక్కువ కావడం దీనికి కార ణం. ముస్లిం పాత్రధారులు ఉన్న 50 సినిమాలపై అష్రఫ్ ఖాన్, సయీదా జరియా బుఖారీ 2011లో జరిపిన అధ్యయనం ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఈ సినిమాల్లో 65.2 శాతం ముస్లింలను చెడ్డ గుణాలున్న వారిగా, దాదాపు 30 శాతం చిత్రాల్లో తటస్థులుగా, కేవలం 4.4 శాతం సినిమాల్లో వారిని దుష్టులుగా చూపించారు. ఇటీవల కాలంలో పరిస్థితి మారింది. జాన్ అబ్రహం నటించిన న్యూయార్క్, షారుఖ్ ఖాన్ చిత్రం మై నేమ్ ఈజ్ ఖాన్, మలయాళ సినిమా అన్వర్లో ముస్లింలే కథానాయకులు. ముల్క్లో గొప్ప మార్పు! అనుభవ్ మిశ్రా సిన్హా దర్శకత్వం వహించిన ‘ముల్క్’ నిజంగా భిన్నమైన చిత్రం. హిందీ ప్రాంత నగరంలో(వారణాసి) నివసించే సాధారణ ముస్లిం కథే ఇందులో చూస్తాం. అయితే దీనిలో ప్రధాన పాత్రధారి(ముస్లిం) హిందూ కోడలు కుటుంబానికి కొంత దూరంగా ఉంటుంది. ముల్క్లో ముస్లింలను దేశభక్తిగల మంచి మనుషులుగానేగాక దుష్టులుగా, ఉగ్రవాదులుగా చూపించారు. ఇందులో మంచి ముస్లిం పోలీసు అధికారి పాత్రలో రజత్ కపూర్ చాలా తక్కువ మాటలతో, గొప్ప నటన ప్రదర్శించారు. వారణాసి ఉగ్రవాద వ్యతిరేక పోలీసు బృదం అధిపతిగా ఆయన తన సొంత మతానికి చెందిన వారిని గడగడలాడిస్తూ ప్రాణాలు తీయడంలో ఉత్సాహం చూపిస్తూ చేసిన నటన ఆకట్టుకుట్టుంది. రోజూవారీ సమస్యలున్న సగటు కుటుంబం కథ ఇది. ఇందులో ఎప్పటిలా కనిపించే మూస కోర్టు దృశ్యాలున్నాయి. ఈ కుటుంబ సభ్యుడైన కొడుకు ఉగ్రవాదిగా మారి పెట్టిన బాంబు పేలగా ముగ్గురు ముస్లింలు సహా 16 మంది మరణిస్తారు. తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో అతను మరణిస్తాడు. నేటి హిందీ ప్రాంత భారత ముస్లిం మనసులో కదలాడే భయం, అభద్రతాభావం, పరస్పర విరుద్ధమైన సంశయాలు, అనుమానాలు, ఆశలు, నిస్పృహలు–ఇవన్నీ సమ్మిళతమై వేధిస్తున్నట్టు ‘ముల్క్’లో కనిపించాయి. ఈ సినిమాలో లాయర్ మురాద్ అలీ మహ్మద్ (రిషికపూర్) సోదరుడి కొడుకు షాహిద్(ప్రతీక్ బబ్బర్) యువ ఉగ్రవాది. అతనిపై అనేక ఒత్తిళ్లతోపాటు ముస్లింలకు ఉద్యోగాలు ఇవ్వరని, ప్రపంచవ్యాప్తంగా వారిపై వివక్ష చూపిస్తున్నారనే ప్రచారం ప్రభావం చూపిస్తుంది. నిజంగా ఏడుగురిలో ఒకరైన ముస్లిం మనసులో ఇలాంటి ఆలోచనలుంటే దేశం ఇంకా అల్లకల్లోలం కాలేదేమిటనే ప్రశ్న తలెత్తుతుంది. ఉగ్రవాదిగా మరణించిన తమ కుటుంబసభ్యుని శవాన్ని తీసుకోవడానికి అత్యంత దేశభక్తిగల కొన్ని ముస్లిం కుటుంబాలు నిరాకరిస్తున్న కారణంగానే దేశంలో ఇంకా మంటల్లో చిక్కుకోలేదా? అంటే ఇదొక్కటే కారణం కాదని ముల్క్ చెబుతోంది. ఈ సినిమాలో నాకు నచ్చిన అత్యంత సాహసవంతమైన అంశం ఏమంటే–ముస్లింలలో అత్యుత్తమ గుణాలున్నవారిని మాత్రమే చూపించడాన్ని ప్రశ్నించడం. మనం దేశం కోసం సరిహద్దుల్లో పోరాడి మరణించిన సైనికుడు హవల్దార్ అబ్దుల్ హమీద్, ఏపీజే అబ్దుల్ కలాం, షెహనాయి విధ్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్‌ను అభిమానిస్తాం. మిగిలిన ముస్లింలందరూ ఇలాగే ఉండాలని ఆశిస్తాం. ఇక్కడే దర్శకుడు అనుభవ్ సిన్హా ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక్కడ చెప్పిన దేశభక్తులు మాత్రమే గొప్పవాళ్లు కాదనీ, అత్యధిక ముస్లింలు కూడా వారిలాంటి బుద్ధిమంతులని ఆయన ముల్క్ ద్వారా చెప్పారు. వాస్తవానికి ఉగ్రవాదులే ముస్లింలలో చాలా తక్కువ మంది ఉన్నారనేది ఆయన సందేశం. ఇరవై ఏళ్లకు పైగా రాస్తున్న ఈ కాలమ్‌లో నేను రెండు సార్లు మాత్రమే హిందీ సినిమాల గురించి రాశాను. మన సమాజం లేదా రాజకీయాల్లో వచ్చిన కొత్త మార్పును (రాజకీయ పడితులు, నేతలు గుర్తించనివి) ప్రస్తావించిన సినిమాల గురించి చర్చించాను. సంపదను, ధనికుల జీవనశైలిని గొప్పగా చూపించిన ఫర్హాన్ అఖ్తర్ సినిమా దిల్ చాహ్తాహై(2001) గురించి మొదటిసారి రాశాను. రెండో సినిమా మసాన్. నీరజ్ ఘ్యావణ్ దర్శకత్వంలో 2015లో వచ్చిన ఈ చిత్రంలో అప్పటి అడ్డూ అదుపూ లేని అభివృద్ధి సమాజంలో, వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో చెప్పడానికి మసాన్ ప్రయత్నించింది. ముల్క్ మాదిరిగానే మసాన్‌ను కూడా వారణాసి నేపథ్యంలోనే నిర్మించారు. ఆధునిక భారతంలో సాధారణ ముస్లిం కుటుంబం కథనే అనుభవ్ సిన్హా ఎంత భిన్నగా చూపించారంటే–ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలంటూ కొందరు డిమాండ్ చేసే పరిస్థితి తలెత్తింది. అయితే, గతంలో మేఘనా గుల్జార్ తీసిన ‘రాజీ’లో ఓ పాకిస్థానీ సైనికుడి కుటుంబంలోని సభ్యులు మంచివారిగా చిత్రించారు. ఇలాంటి సినిమాలు తీసే ధైర్యం, ఆత్మవిశ్వాసం భారతీయులకు ఉన్నందుకు మనం గర్వపడాలి. ఇప్పుడు ముల్క్ కూడా ‘రాజీ’లో మాదిరిగానే వాస్తవాలను ధైర్యంగా చెప్పింది. 2005లో ఇదే వారణాసి నగరంలోని గొప్ప ముస్లిం కళాకారుడు బిస్మిల్లా ఖాన్ నుంచి ఓ అద్భుతమైన పాఠం నేర్చుకున్నాను. నా ‘వాక్ ద టాక్’ ఇంటర్వ్యూ కోసం ఆయనను కలిసినప్పుడు, ‘‘జిన్నా స్వయంగా మిమ్మల్ని కోరినా మీరు 1947లో పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లిపోలేదు?’’ అని ప్రశ్నించాను. ‘‘ కైసే జాతే హమ్? వహా హమారా బనారస్ హై క్యా?’’(ఎందుకు వెళ్తాను? అక్కడేమైనా మా బెనారస్ ఉందా?) అని బిస్మిల్లాఖాన్ జవాబిచ్చారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంచి సందేశమిస్తున్న ముల్క్ చూడాలనే నేను సలహా ఇస్తున్నాను. శేఖర్ గుప్తా ,వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ (twitter@shekargupta) -
అలాంటి సినిమాలు...హిందీలో చేస్తా!
చంటిగాడు లోకల్... నేను కాలు పెడితే మీ దరిద్రం దూల తీరిపోద్ది... వంటి డైలాగులు థియేటర్లో వినపడితే మాస్ ప్రేక్షకుల సందడికి కొదవ ఉండదు. చప్పట్లు, విజిల్స్ హోరుతో హాలు మార్మోగిపోతుంది. ఆ రేంజ్లో మాస్‌ని ఆకట్టుకునే ఏ ఆర్టిస్ట్‌కైనా తిరుగుండదు. అందుకే మాస్లో రవితేజ తిరుగులేదనిపించుకున్నారు. వెరైటీ స్టైల్లో డైలాగులు చెప్పడం, వెరైటీ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకోవడం రవితేజకు బాగా తెలుసు. ఇంతకీ ఈ హీరోగారు ఇప్పుడేం చేస్తున్నారు? నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్’ అనే సినిమాతో రెడీ అవుతున్నారు. తెలుగులో రకరకాల పాత్రలు చేసి, మెప్పించిన రవితేజకు వేరే భాషలో సినిమా చేసే ఉద్దేశం లేదా? ‘బాహుబలి’ ద్వారా ప్రభాస్, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో పవన్ కల్యాణ్ పరిచయమైనట్లు హిందీ తెరకు పరిచయం కావాలని అనుకోవడం లేదా? అసలు హిందీలో స్ట్రయిట్ సినిమాకి అవకాశం వస్తే చేస్తారా? ‘చేస్తా’ అంటున్నారు రవితేజ. అయితే ఇప్పటివరకూ తెలుగులో చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే పాత్రలైతేనే హిందీ చిత్రాలు చేస్తానని రవితేజ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ మధ్య విడుదలైన ‘కీ అండ్ కా’, ‘కపూర్ అండ్ సన్స్’ వంటి సినిమాలైతేనే హిందీకి ‘సై’ అంటానని స్పష్టం చేశారు. తెలుగులో చేసినట్లుగానే రెగ్యులర్ యాక్షన్, కామెడీ మూవీస్ చేయాల్సి వస్తే... అదేదో ఇక్కడే చేయొచ్చు కానీ, ఇలాంటి చిత్రాలే చేయడానికి హిందీ రంగానికి వెళ్లాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. సో.. హిందీలో వెరైటీ సబ్జెక్ట్‌తో ఎవరైనా మాస్ మహరాజ్‌ని సంప్రతిస్తే.. హిందీకి ఎగరేసుకు పోవచ్చన్న మాట! -
అనుకున్నామని జరగవు అన్నీ...
ఏ బియ్యపు గింజ మీద ఎవరి పేరు రాసి ఉంటుందో ఎవరికి తెలుసు? సినిమా పాత్రల విషయమూ సరిగ్గా అంతే! ఒక పాత్ర ఒకరి కోసం అనుకున్నా... ఆఖరికి అది వేరెవరికో దక్కడం సినీ రంగంలో సహజం. అలాంటి కొన్ని హిందీ చిత్రాలు... విచిత్రాలు... ‘జంజీర్’ అనగానే మనకు అమితాబ్ గుర్తుకొస్తారు. కానీ, జంట రచయితలు సలీమ్ -జావేద్ ‘జంజీర్’ కథ తయారు చేసి మొదట వినిపించింది దేవానంద్‌కు! ఆ తర్వాత ధర్మేంద్రకు చెప్పారు. ఇద్దరూ నిరాకరించారు. రాజేశ్ ఖన్నాకు చెబుదా మనుకున్నారు. అయితే ‘హాథీ మేరే సాథీ’ షూటింగ్లో రాజేశ్ ఖన్నాకు, వీరికి భేదాభిప్రాయాలు వచ్చాయి. మరి ఈ కథను ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అమితాబ్ బచ్చన్ నటించిన ‘బాంబే టూ గోవా’ చూశారు జావేద్. * ఆ కథకు అతనే హీరో అని నిర్ణయించేసుకున్నారు. అలా అనుకోకుండా దక్కిన ‘జంజీర్’తో అమితాబ్ సూపర్స్టారైపోయారు. * ‘షోలే’లో గబ్బర్‌సింగ్ పాత్రకు మొదట డానీని అనుకున్నారు. ఆయన నిరాకరించడంతో అమ్జాద్ఖాన్కు అవకాశం దక్కింది. * ‘ఆనంద్’ సినిమాను హృషీకేశ్ ముఖర్జీ నిజానికి ఉత్తమ్‌కుమార్‌తో తీయాలనుకున్నారు. కుదర్లేదు. ఆ తర్వాత కిశోర్‌కుమార్, శశికపూర్‌తో చేయాలనుకున్నారు. చివరకు రాజేశ్‌ఖన్నా, అమితాబ్ బచ్చన్‌తో ‘ఆనంద్’ పూర్తి చేశారు. * ‘రజనీగంధ’ చిత్రంలో మొదట శశికపూర్, షర్మిలా టాగూర్, అమితాబ్ బచ్చన్లను తీసుకోవాలనుకున్నారు బాసూ చటర్జీ. కానీ, వారి కాల్షీట్లు దొరకలేదట. అందుకే కొత్త తారలతో చేయాలని నిశ్చయించుకున్నారు. శశికపూర్ వేషానికి అమోల్ పాలేకర్‌ను, షర్మిలా టాగూర్ వేషానికి విద్యను, అమితాబ్ వేషానికి దినేష్ టాగూర్‌ను తీసుకున్నారు. కొత్తవారితో తీసిన ఆ చిత్రం గొప్ప విజయం సాధించింది. * అనిల్‌కపూర్, శ్రీదేవి నటించిన ‘మిస్టర్ ఇండియా’ చిత్రంలో మొదట హీరోగా అమితాబ్ బచ్చన్‌ను అనుకున్నారు. * షారుక్ ఖాన్ కెరీర్లో మైలురాయి అంటే ‘దిల్ వాలే దుల్హేనియా లేజాయేంగే’చెప్పుకోవాలి. అందులో హీరోగా మొదట అనుకున్నది - సైఫ్ అలీఖాన్ని. * ‘లగాన్, మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రాలకు హీరోగా ముందు షారుక్ ఖాన్‌ను అనుకున్నారు. చివరకు ‘లగాన్’ ఆమిర్‌ఖాన్ చేస్తే, ‘మున్నాభాయ్’ చిత్రాన్ని సంజయ్‌దత్ చేశారు. * వసూళ్లలో సంచలనం సృష్టించిన ‘త్రీ ఇడియట్స్’కు మొదట హీరోగా షారుక్‌ఖాన్‌ను అనుకున్నారు రాజ్‌కుమార్ హిరానీ. అయితే షారుక్ ఖాన్ తన సొంత సంస్థలో చేద్దామని షరతు పెట్టాడు. దాంతో ఆ సినిమా ఆమిర్‌ఖాన్ దగ్గరకు వచ్చింది. * ‘రంగ్ దే బసంతి’ నిజానికి హృతిక్ రోషన్ సినిమా. ఆయన ఈ కథ చేయడానికి ఆసక్తి చూపలేదు. ఆమిర్‌ఖాన్ మాత్రం ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశాడు. -
హిందీకి రెడీ!
ఆరడుగుల అందగాడు ప్రభాస్‌కి ఇప్పటికే ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ బోల్డంత ఉంది. ఇప్పుడా జాబితా ఇంకా పెరిగింది. ఇప్పటివరకూ దక్షిణాది అమ్మాయిలే ప్రభాస్‌ని ఇష్టపడ్డారు. ఇప్పుడు ఉత్తరాది భామలు కూడా ప్రభాస్‌కి అభిమానులైపోయారు. ఆ ఘనత మొత్తం ‘బాహుబలి’కే దక్కుతుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ అజయ్ దేవగన్ నటించిన హిందీ చిత్రం ‘యాక్షన్ జాక్సన్’లో ప్రభాస్ అతిథి పాత్ర చేసినప్పటికీ, అది చాలామంది దృష్టికి వెళ్లలేదు. ఇప్పుడు ‘బాహుబలి’ ఫస్ట్ లుక్‌తోనే ఉత్తరాదివారికి డార్లింగ్ అయిపోయారు. ఈ యంగ్ రెబల్ స్టార్‌కి అక్కడ చాలా క్రేజ్ వచ్చింది. మరి.. హిందీ చిత్రాలకు అవకాశం వస్తే, చేస్తారా? అనే ప్రశ్న ప్రభాస్ ముందుంచితే -‘‘ఎందుకు చేయను? దేశంలోనే హిందీ రంగం చాలా పెద్దది. ఒకవేళ మంచి అవకాశం వస్తే, తప్పకుండా చేస్తా’’ అన్నారు. -
టాలీవుడే టాప్
తెలుగు చిత్రాల నిర్మాణం... విడుదలలో టాలీవుడ్ గత ఏడాది దూసుకుపోయింది. దేశవ్యాప్తంగా గత ఏడాది (ఏప్రిల్ 2013 - మార్చి 2014) మొత్తం1966 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 349 తెలుగు చిత్రాలు విడుదలై టాలీవడ్ మొదటి స్థానంలో నిలిచింది. 326 తమిళ చిత్రాల విడుదలతో తమిళ చిత్ర పరిశ్రమ ఆ తర్వాత స్థానాన్ని పొందింది. 263 హింది చిత్రాల విడుదలతో బాలీవుడ్ మూడో స్థానంలో నిలిచింది. అయితే 2012- 13 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1724 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో తమిళ చిత్రాలు 292 విడుదలై... మొదటిస్థానాన్ని ఆక్రమించగా, 280 చిత్రాలతో తెలుగు సినిమా రెండో స్థానంలో నిలిచింది. అలాగే 255 హిందీ చిత్రాలతో మూడో స్థానంలో నిలిచింది. కానీ అంతకుముందు ఏడాదిలో ఉన్న తమిళ చిత్రాల సంఖ్యను పడతోసి టాలీవుడ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు మొదటి స్థానంలో ఉన్న తమిళ చిత్రాల స్థానాన్ని గత ఏడాది తెలుగు చిత్రాలు అక్రమించాయి. అయితే తెలుగు చిత్రాలు భారీ సంఖ్యలో విడుదలవుతున్న బాక్సాఫీసు వద్ద అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. అది పెద్ద పెద్ద హీరోలు నటించిన ఈ పరిస్థితి నెలకొంది. చిత్రాల నిర్మాణంపై ఉన్న అసక్తితో చిన్న చిత్రాలు విడుదల సంఖ్య భారీగా పెరిగిందని... అలాగే డిజిటల్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడంతో టాలీవుడ్ పరిశ్రమలో భారీ సంఖ్యలో చిత్రాలు విడుదలవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఆ నిర్వచనమే తప్పు
హిందీ చిత్రాలను జాతీయ సినిమాలుగా, మిగతా వాటిని ప్రాంతీయ చిత్రాలుగా పిలిచే సంస్కృతి మంచిది కాదని జాతీయ అవార్డు గ్రహీత గౌతమ్ ఘోష్ అన్నారు. అన్ని సినిమాలనూ భారతీయ చిత్రాలని మాత్రమే పిలవాలని కోరారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దూరదర్శన్ సంయుక్తంగా ఈ నెల ఆరు నుంచి ఢిల్లీలో నిర్వహిస్తున్న బెంగాల్ చిత్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ ఘోష్ పైవిధంగా అన్నారు. అంతర్జాతీయస్థాయి అవార్డులు, ప్రశంసలు సాధించిన సినిమాలను ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఘోష్ మాట్లాడుతూ ‘సినిమాకు దర్శకుడు అత్యంత కీలకం. నిజానికి సినిమాలో అతణ్నే ముఖ్యపాత్రగా భావించాలి. సినిమా జయాపజయాలకు అతడిదే పూర్తి బాధ్యత. నటులు, సిబ్బందిని నియంత్రించాల్సిన బాధ్యత కూడా దర్శకుడిపైనే ఉంటుంది. మనదేశంలో అన్ని సినిమాలనూ భారతీయ చిత్రాలని మాత్రమే పిలవాలి’ అని వివరించారు. ఘోష్ గురించి మరో ఆసక్తికర విషయమేమంటే ఆయన ప్రఖ్యాత దర్శకుడే కాదు.. సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కూడా. ప్రతి దర్శకుడు నటీనటుల మనోభావాలను గుర్తెరిగి వారితో పనిచేయించుకోవాలని సూచించాడు. ఎంత పెద్ద నటులైనా, నటన రానివాళ్లకైనా ఈ సూత్రం వర్తిస్తుందని స్పష్టం చేశాడు. ‘సినిమా, అనువర్తిత కళలు-పరస్పరాశ్రయం’ పేరుతో నిర్వహించిన చర్చలో మాట్లాడిన ఈ బెంగాలీ దర్శకుడు పైవిషయాలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు అశోక్ విశ్వనాథన్, సినీ విమర్శకుడు మనోజిత్ లాహిరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమకాలీన సినీపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి విశ్వనాథన్ మాట్లాడుతూ సినిమా కళ అంతర్భాగమేనని గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఘోష్ 2005లో తీసిన నిశబ్ద్ సినిమాను కూడా ఈ ఉత్సవంలో ప్రదర్శించారు.