హిందీకి రెడీ! | Baahubali Star Prabhas Will do a Bollywood Film if he Gets a 'Good Offer' | Sakshi
Sakshi News home page

హిందీకి రెడీ!

Published Mon, Jun 22 2015 11:04 PM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

హిందీకి రెడీ!

హిందీకి రెడీ!

ఆరడుగుల అందగాడు ప్రభాస్‌కి ఇప్పటికే ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ బోల్డంత ఉంది. ఇప్పుడా జాబితా ఇంకా పెరిగింది. ఇప్పటివరకూ దక్షిణాది అమ్మాయిలే ప్రభాస్‌ని ఇష్టపడ్డారు. ఇప్పుడు ఉత్తరాది భామలు కూడా ప్రభాస్‌కి అభిమానులైపోయారు. ఆ ఘనత మొత్తం ‘బాహుబలి’కే దక్కుతుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ అజయ్ దేవగన్ నటించిన హిందీ చిత్రం ‘యాక్షన్ జాక్సన్’లో ప్రభాస్ అతిథి పాత్ర చేసినప్పటికీ, అది చాలామంది దృష్టికి వెళ్లలేదు. ఇప్పుడు ‘బాహుబలి’ ఫస్ట్ లుక్‌తోనే ఉత్తరాదివారికి డార్లింగ్ అయిపోయారు.

ఈ యంగ్ రెబల్ స్టార్‌కి అక్కడ చాలా క్రేజ్ వచ్చింది. మరి.. హిందీ చిత్రాలకు అవకాశం వస్తే, చేస్తారా? అనే ప్రశ్న ప్రభాస్ ముందుంచితే -‘‘ఎందుకు చేయను? దేశంలోనే హిందీ రంగం చాలా పెద్దది. ఒకవేళ మంచి అవకాశం వస్తే, తప్పకుండా చేస్తా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement