
'ఛాట్ జీపీటీ'కి పోటీగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రవేశపెట్టిన ‘గ్రోక్’ సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ కూడా తమ మూవీ ప్రమోషన్ల కోసం గ్రోక్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రశ్న ఏదైనా సరే దానిని అడిగిన వెంటనే అదే స్టైల్‌ల్లో సమాధానం వచ్చేస్తుంది. ఒకవేళ వాళ్లు వాడిన బూతు మాటల్ని తిరిగి వాళ్ల మీదే ప్రయోగిస్తూ బోలెడంత వినోదాన్ని పంచుతోంది. అందుకే ఇప్పుడు నెట్టింట గ్రోక్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే నితిన్ 'రాబిన్‌హుడ్' సినిమా ట్రైలర్ తేదీని ప్రకటించేందుకు గ్రోక్‌ను సంప్రదించారు. దాని నుంచి వచ్చిన సమాధానాలు విన్న అందరిలోనూ నవ్వులు తెప్పిస్తున్నాయి.

దర్శకుడు వెంకీ కుడుముల, నితిన్ ఇద్దరూ కలిసి రాబిన్‌హుడ్ ట్రైలర్ లాంచ్ ముహూర్తం కోసం ఒక సిద్ధాంతిని కలవాలని అనుకుంటారు. ఈరోజుల్లో సిద్ధాంతి ఏంటి బ్రో అంటూ.. గ్రోక్‌ను సంప్రదించాలని నితిన్ సలహా ఇస్తాడు.. అక్కడి నుంచి మొదలౌతుంది అసలు కథ. ట్రైలర్ లాంచ్ కోసం ఒక సరైన ముహూర్తం చెప్పాలని వెంకీ కుడుముల ఇంగ్లీష్‌లో టైప్ చేస్తాడు. అప్పుడు పంచ్ డైలాగ్‌తో గ్రోక్ సమాధానం ఇస్తుంది. దీంతో షాక్ అయిన దర్శకుడు వెంటనే నితిన్‌ను డీల్ చేయమంటాడు. ఆ సమయంలో దానిని నువ్వే డీల్ చేయ్ అని నితిన్ అనడంతో.. గ్రోక్ నుంచి అదే రేంజ్‌లో సమాధానం వస్తుంది. నువ్వు దాన్ని, దీన్నీ అంటే నీ గూబ పగిలిపోతుందని సమాధానం ఇస్తుంది. ఇలా సుమారు రెండు నిమిషాల పాటు సరదాగా గ్రోక్‌తో రాబిన్‌హుడ్ టీమ్ ముచ్చట్లు కొనసాగుతాయి.
‘రాబిన్‌హుడ్’ సినిమా ట్రైలర్ మార్చి 21న సాయింత్రం 4గంటల 5నిమిషాలకు విడుదలౌతుందని మేకర్స్ ప్రకటంచారు.వెంకీ కుడుముల డైరెక్షన్‌లో నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సినిమాలో అతిథిగా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కనిపించనున్నడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment