కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డుల ఉపయోగాలివే.. | applications of co branded credit cards which is introducing by financial cos | Sakshi
Sakshi News home page

కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డుల ఉపయోగాలివే..

Published Thu, Jun 20 2024 12:05 PM | Last Updated on Thu, Jun 20 2024 12:07 PM

applications of co branded credit cards which is introducing by financial cos

నెలవారీ వేతనం ఈఎంఐలు, ఇంటిఖర్చులు, ఇతర పెట్టుబడులు, పొదుపు..ఇలా బ్యాంకులో జమైన కొద్దిరోజులకే ఇట్టే ఖర్చయిపోతోంది. నెలాఖరు వరకు చాలామంది చేతిలో డబ్బులేని పరిస్థితి ఏర్పడుతోంది. దాంతో క్రెడిట్‌ కార్టులకు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పటిలా కాకుండా బ్యాంకులు కూడా వీటిని సులువుగా జారీ చేస్తున్నాయి. క్యాష్‌బ్యాక్‌, రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు ఉండటంతో వీటిని వినియోగించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ క్రమంలో ఆర్థిక సంస్థలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, టాటా..వంటి కొన్ని కార్పొరేట్‌ సంస్థలతో కలిసి కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. అసలు ఏమిటీ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్టులు? వీటి ఉపయోగం ఏమిటనే అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

కో బ్రాండెండ్‌ క్రెడిట్‌ కార్డు

వినియోగదారుల అవసరాలు మారుతున్నాయి. అందుకు అనుగుణంగా కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకునేలా ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ప్రత్యేకంగా కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను అందిస్తున్నాయి. నిర్దిష్ట బ్రాండ్లు, వ్యాపారాలు, రిటైలర్లు, సర్వీస్‌ ప్రొవైడర్లు..వంటి వాటితో అనుబంధంగా వీటిని ఇస్తున్నారు. అయితే, ఈ కార్డుల ద్వారా సాధారణ క్రెడిట్‌ కార్డుల కంటే అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవి తమ అనుబంధ బ్రాండ్‌లతో చేసిన లావాదేవీల ఈఎంఐలపై తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు రాయితీ వంటి ప్రయోజనాలు కల్పిస్తాయి. ఉదాహరణకు..ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి కో బ్రాండెడ్‌ క్రెడిట్‌కార్డు అందిస్తోంది. వినియోగదారులు దీనితో ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్‌ చేస్తే నిబంధనల ప్రకారం అదనంగా రాయితీలుంటాయి. దానివల్ల అటు వినియోగదారులకు, ఇటు క్రెడిట్‌కార్డు సంస్థలకు లాభం చేకూరుతుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ప్రయోజనాలు..

  • కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఉపయోగించి లావాదేవీలు చేసే వారు నిబంధనల ప్రకారం టార్గెట్‌ చేరుకుంటే వార్షిక రుసుము మినహాయింపు పొందొచ్చు.

  • ప్రతి లావాదేవీలో రివార్డు పాయింట్లు అందుతాయి.

  • కార్డు ఇస్తున్న సంస్థలు సూచించిన మర్చంట్స్‌ నుంచి నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే తక్కువ వడ్డీకి రుణాల్ని పొందవచ్చు.

  • కొత్తగా ఈ కార్డులను తీసుకున్న వారికి వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద షాపింగ్‌ కూపన్లు, డిస్కౌంట్లు ఉంటాయి.

ఇదీ చదవండి: ఈపీఎస్‌లో మార్పులు.. పదేళ్ల సర్వీసు లేని వారికి నష్టం

కార్డు ఎంపిక ఇలా..

కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును ఎంచుకునే ముందు దేనిపై ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవాలి. ఒకవేళ నిత్యం ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా షాపింగ్‌ చేస్తే దానికి అనుబంధంగా ఉన్న సంస్థ కార్డును ఎంచుకోవాలి. లేదంటే అమెజాన్‌లో షాపి​ంగ్‌ చేస్తే ఆ సంస్థతో భాగస్వామ్యంగా ఉన్న కార్డును సెలక్ట్‌ చేసుకోవాలి. కార్డు ఎంచుకునేముందు ఫీచర్లు, రుసుములు, వడ్డీ రేట్లు, ఆఫర్లు, రివార్డ్‌ పాయింట్లు వంటి ప్రయోజనాలు ఏ మేరకు ఉన్నాయో ముందే తెలుసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement