
ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారియట్ బాన్‌వాయ్ కలిసి కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. దీనికి రూ. 3,000 వార్షిక ఫీజు ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్, గోల్ఫ్ సెషన్లు, హోటళ్లలో కాంప్లిమెంటరీ బస తదితర ప్రయోజనాలను ఈ కార్డు ద్వారా పొందవచ్చని సంస్థలు తెలిపాయి.
ఏటా 25–30 శాతం కొత్త కార్డులను జారీ చేస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేమెంట్స్ బిజినెస్ హెడ్ పరాగ్ రావు తెలిపారు. ఇతర పోటీ ఆర్థిక సంస్థలు మొండి బాకీల సమస్యలు ఎదుర్కొంటున్నా తమ అసెట్స్ నాణ్యత మాత్రం మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2023 జూన్ ఆఖరు నాటికి మార్కెట్లో 1.83 కోట్ల పైచిలుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment