
సాక్షి, అమరావతి : నవంబర్ 1వ తేదీని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగుతల్లికి పూలమాల వేసి అమరజీవి పొట్టిశ్రీరాములుకు నివాళులర్పించనున్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం జగన్ గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, పాల్గొననున్నారు. కాగా ఆయా జిల్లాల్లో ఇంచార్జి మంత్రులు, కలెక్టర్లు ఆద్శర్యంలో అవతరణ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దీంతో పాటు ఢిల్లీలోని ఏపీ భవన్ లో అవతరణ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.