బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌కి ఇది ఫన్ టైమ్. ఆల్రెడీ ఐశ్వర్యారాయ్ ఇంట జరిగిన దీపావళి వేడుకలు బాలీవుడ్ వీధుల్లో బాగానే ప్రతిధ్వనించాయి. ఇంతటితో ఐశ్వర్య సెలబ్రేషన్స్‌కు ఫుల్‌స్టాప్ పడలేదు. ఎందుకంటే నవంబర్ 1న ఆమె పుట్టినరోజు. ఈ వేడుకల కోసం భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యలతో కలిసి రోమ్ వెళ్లనున్నారామె. అక్కడ దాదాపు వారం రోజుల పాటు ఉండేలా అభిషేక్ ఈ హాలిడేని ప్లాన్ చేశారు. పనిలో పనిగా తాను ప్రచారకర్తగా ఉన్న ఓ ఉత్పత్తికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని, నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రీ–బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సందడి చేస్తారు ఐశ్వర్య. ఇలా నవంబర్ మొదటి వారం అంతా ఐశ్వర్య సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు. తిరిగొచ్చాక మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో తాను చేయనున్న పాత్ర కోసం కసరత్తులు మొదలుపెడతారామె. అభిషేక్ బచ్చన్ కూడా ‘బిగ్ బుల్’ సినిమాతో బిజీ అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment