
ఇటు వినాయక చవితి మరోవైపు వస్తున్న విజయదశమి సందర్భంగా బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గత ఐదు రోజుల నుంచి గోల్డ్ రేట్లు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఈ రోజు పసిడి ధరలు ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఉన్నాయి? తెలంగాణలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఈ రోజు (19 సెప్టెంబర్ 2023) ఒక గ్రామ్ 22, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5520 & రూ. 6022గా ఉంది. అంటే నిన్నటి కంటే ఈ రోజు గోల్డ్ రేట్ రూ. 15 & రూ. 14 ఎక్కువ అని తెలుస్తోంది. దీని ప్రకారం నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం విలువ రూ. 55200 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60220.
👉హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్స్ అండ్ 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55200 & రూ. 60220గా ఉంది. విజయవాడలో కూడా ఇదే ధరలు ఉన్నాయి.
👉వెండి విషయానికి వస్తే, హైదరాబాద్ & విజయవాడలో ఒక గ్రామ్ వెండి రూ. 78.30. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 78300. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద 100 పెరిగినట్లు తెలుస్తోంది.
👉చెన్నైలో ఒక గ్రాము 22 క్యారెట్ల & 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5550 అండ్ రూ. 6055. 10 గ్రాముల బంగారం రూ. 55500 (22క్యారెట్స్) రూ. 60550 (24 క్యారెట్స్)
👉ఢిల్లీలో ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 5535 కాగా 24 క్యారెట్ బంగారం రూ. 6037గా ఉంది. 10 గ్రాముల పసిడి ఇక్కడ రూ. 55350 (22 క్యారెట్) రూ. 60370 (24 క్యారెట్).
👉చెన్నైలో 1 గ్రామ్ వెండి రూ. 78.30. కావున కేజీ వెండి ధర రూ. 78300. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధరలు కేజీపై రూ. 300 పెరిగింది.
👉ఢిల్లీలో వెండి ఒక గ్రామ్ ధర రూ. 74.80. దీని ప్రకారం ఒక కేజీ వెండి ధర రూ. 74800. నిన్న కంటే నేడు వెండి ధర రూ. 300 అధికం కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment