టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొత్త కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల సరికొత్త 'మూన్‌వాకర్స్' అనే ఎలక్ట్రిక్ షూస్ పుట్టుకొచ్చాయి. ఈ లేటెస్ట్ షూస్ ధర ఎంత? దీన్ని ఎలా ఉపయోగించాలనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అమెరికన్ బేస్డ్ కంపెనీ 'షిఫ్ట్ రోబోటిక్స్' అభివృద్ధి చేసిన మూన్‌వాకర్స్ షూస్ సాధారణ ఎలక్ట్రిక్ షూస్ కంటే కూడా వేగంగా ఉంటాయని సంస్థ ప్రకటించింది. ఇది రోజు వారీ వినియోగానికి ఉపయోగించే షూస్ మాదిరిగానే ఉపయోగించాల్సి ఉంటుంది. స్కేటింగ్ షూస్ మాదిరిగా ఉపయోగించవచ్చనుకుంటే పొరపాటే.
మూన్‌వాకర్స్ ఎలక్ట్రిక్ షూస్ బ్యాటరీ మీద ఆధారపడి, ఏఐ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇవి ఐపీ45 వాటర్ రెసిస్టెంట్ కావడం వల్ల వర్షం సమయంలో నీటిలో తడిచినా సురక్షితంగా ఉంటాయి. ఛార్జింగ్ కోసం USB టైప్-సీ పోర్ట్ ఇందులో లభిస్తుంది.
ఇదీ చదవండి: నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు - వైరల్ వీడియో
రెండు కేజీల బరువున్న ఈ షూస్ కేవలం EU 42-45 సైజులో పురుషులకు మాత్రమే తయారు చేశారు. అంతే కాకుండా ఈ షూస్ ధరించేవారు బరువు 100 కేజీల కంటే ఎక్కువ ఉండకూడదు. దీని ధర 1399 డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ.1.16 లక్షలు).
Comments
Please login to add a commentAdd a comment