
గత కొద్ది కాలంగా కొనుగోలు దారులకు పసిడి ధరలు షాకిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్త ఏడాది ప్రారంభంతో పెరిగిపోతున్న బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే..అంతర్జాతీయ మార్కెట్లో నేడు (డిసెంబర్ 26) స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2,055 డాలర్ల పైన కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,200 ఉండగా.. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ల ధర రూ. 63,490గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,350లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,640గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,800లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,150గా నమోదైంది.
ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,490గా కొనసాగుతోంది.
బంగారం ధర స్థిరంగా.. వెండి ధర మాత్రం
బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి ధర మాత్రం పెరిగింది. మంగళవారం దేశీయ మార్కెట్‌లో కిలో వెండిపై రూ. 200 పెరిగి.. రూ. 79,200లుగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 79,200గా ఉంది. బెంగళూరులో మాత్రం అత్యల్పంగా 76,750గా ఉంది. ఇక చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,700 వద్ద కొనసాగుతోంది.